Site icon HashtagU Telugu

Spirituality: గుడిలోకి అడుగుపెట్టేముందు గడపకు ఎందుకు నమస్కారం చేస్తారో తెలుసా?

Spirituality

Spirituality

సాధారణంగా మనం దేవాలయాలకు వెళుతూ ఉంటాం. అక్కడికి వెళ్లిన తర్వాత మనం చేసే కొన్ని రకాల పనుల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అన్నది చాలా మందికి తెలియదు. దేవుడిని దర్శించుకోవడం,ప్రసాదాన్ని స్వీకరించడం ఆలయ ప్రదక్షిణలు చేయడం, కోనేటిలో స్నానాలు చేయడం, గుడిలో గంట మోగించడం, ప్రధాన ముఖ ద్వారానికి నమస్కరించుకోవడం ఇలాంటి పనులు అన్నీ కూడా ఎందుకు చేస్తారు వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అన్నది చాలా మందికి తెలియదు.

గుడికి వెళ్ళినప్పుడు మొదట గుడి బయట కాళ్లు కడుక్కొని లోపల అడుగుపెట్టే సమయంలో ప్రధాన ముఖద్వారానికి అనగా గడపకి నమస్కారం చేస్తూ ఉంటారు. ఒకరి తర్వాత మరొకరు వంగి నమస్కరిస్తూ ఆ గడపని దాటి వెళుతుంటారు. ఎందుకిలా అని అడిగితే మా పెద్దలు పాటించారు కొందరు చెబితే మిగతావారు అందరూ ప్రార్థిస్తున్నారు కాబట్టి మేము ప్రార్థిస్తున్నాము అని చెబుతూ ఉంటారు. కానీ దాని వెనుక ఉన్న అసలు రీజన్ ఏంటి అన్నది. సాధారణంగా మన ఇంటికి ఉపయోగించే ద్వారాలన్నీ కూడా చెక్కతో చేసినవి ఉంటాయి. ఆలయాలకు మాత్రం రాతితో తయారు చేసినవి ఉంటాయి.

ఎందుకు అంటే ఇళ్ల ద్వారాల మాదిరిగానే ఆలయాలకు కూడా చెక్కతో పెట్టొచ్చు కదా అంటే దాని వెనుక ఒక కథనం ఉంది. అదేమిటంటే.. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయంగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు ప్రవేశ ద్వారంగా అమరుస్తారు. ఆ కొండ నుంచి తీసుకొచ్చిన రాయి నిత్యం భగవన్నామస్మరణలో ఉంటుందట. అందుకే ఆ రాయి తొక్కుతూ లోపలకు అడుగుపెట్టకూడదని దాన్ని దాటుకుంటూ వెళ్లే క్రమంలో ముందుగా క్షమించమని అడుగుతూ చేసే నమస్కారం అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రధాన ఆలయాల్లో ద్వారంపై అడుగేయకుండా దాటాలాని పండితులు చెబుతారు.