Site icon HashtagU Telugu

Temple: గుడికి వెళ్తున్నారా.. అయితే ఈ పద్ధతులు పాటించాల్సిందే?

Temple

Temple

మామూలుగా మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాము. వాటి వల్ల ఎన్నో రకాల కష్టాలు కూడా అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. ఆలయానికి వెళ్ళినప్పుడు మన మనసులోని బాధలు దేవుడికి చెప్పుకోవడంతో పాటు కోరిన కోరికలు నెరవేర్చమని ఆ దేవుడిని కోరుకుంటూ ఉంటారు. ఆలయానికి వెళ్లినప్పుడు మనం ఎలాంటి మనస్సుతో దేవుడిని దర్శించుకోవాలి. అలాగే గుడిలో పాటించవలసిన కొన్ని పద్ధతులు నియమాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆలయాన్ని ప్రదక్షిణగా చుట్టి రావడానికి ముందే దైవానికి ప్రసన్నమైన మనస్సుతో నమస్కారం చేయాలి.

నిధానంగా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి. ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడు దేవాలయం, ధ్వజ స్ధంభం నీడనకానీ, ప్రాకారం నీడను కానీ దాటకూడదు. యజ్ఞోపవీతం ఉన్నవారు నడుముకు చుట్టుకొని కానీ, చెవికి తగిలించుకుని కానీ, అపసవ్యంగా వేసుకొని కానీ, లేదా దండ వలె ధరించి కానీ ఆలయప్రవేశం చేయకూడదు. చంచలమైన మనస్సుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ముందు నిలబడి అబద్దాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్యస్వరూపుడు కాబట్టి ఆయన ఎదుట సత్యాన్ని దాచకూడదు. దేవాలయంలో దేవునికి వీపు భాగం చూపిస్తు కూర్చోకూడదు. శివాలయంలో లింగం, నందికి మధ్యలో నడవకూడదు.

శివాలయంలో లోపల లింగం చుట్టూ ప్రదక్షిణ చేయకూడదు, బయట చేయాలి. వస్త్రంతో కానీ, శాలువాతో కానీ శరీరాన్ని కప్పుకోవాలి. దేవాలయంలో ప్రవేశించి భక్తితో రోదించకూడదు. రోదిస్తూ దేవుని స్తుతించకూడదు. గంజి వేసిన వస్త్రాలు ధరించి దేవుని దర్శించ కూడదు. దేవాలంలో స్వార్ధంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండ కూడదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి. గుడి దగ్గర ఉండే యాచకులకు తోచిన సహాయం తప్పక చేయాలి. ఇంటి నుండి తయారు చేసుకుని తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని తప్పక అక్కడ వితరణ చేయాలి. మహిళలు తప్పక కుంకుమ బొట్టు ధరించాలి. టిక్లిలు పెట్టరాదు, ముత్తైదువలు కాళ్ళకు పారాణి ధరించాలి, తలలో ఏదేని పువ్వులను ధరించాలి. మహిళలు జుట్టు విరబోసుకుని దేవాలయాలు దర్శించ కూడదు మలిన, చిరిగిన వస్త్రాలు ధరించి వెళ్ళకూడదు. ఉతికిన బట్టలనే వేసుకోవాలి.

Exit mobile version