Rules: గుడికి వెళ్ళినప్పుడు కచ్చితంగా పాటించాల్సిన పద్ధతులు ఇవే?

చాలామంది నిత్యం గుడికి వెళుతూ ఉంటారు. వారికున్న కష్టాలను తొలగించమని దేవుడిని వేడుకుంటూ ఉంటారు.

  • Written By:
  • Publish Date - November 30, 2022 / 06:00 AM IST

చాలామంది నిత్యం గుడికి వెళుతూ ఉంటారు. వారికున్న కష్టాలను తొలగించమని దేవుడిని వేడుకుంటూ ఉంటారు. అలాగే మరి కొంతమంది ప్రశాంతత కోసం దేవాలయాలకు వెళ్తూ ఉంటారు. అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు మనం ఎటువంటి పనులు చేయాలి. ఎలా ప్రవర్తించాలి? ఏ విధంగా ఉండాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయడానికంటే ముందుగా దేవుడికి మొక్కుకొని ఆ తర్వాత ప్రదక్షిణలు చేసి అనంతరం లోపలికి వెళ్ళాలి. అలాగే ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప ఇంకెప్పుడూ దేవాలయం ధ్వజస్తంభం నీడను, ప్రాకారం నీడను కానీ దాటకూడదు.

అలాగే చంచల మనసుతో స్వామిని దర్శించకూడదు. ఆలయంలో దేవుని ఎదుట అబద్ధాలు చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు సత్య స్వరూపుడు కాబట్టి దేవుడు ముందు అబద్ధాలు చెప్పరాదు. అలాగే ఎప్పుడు దేవాలయంలో దేవుడికి వీపు భాగం చూపిస్తూ కూర్చోకూడదు. శివాలయంలో ఇప్పుడు శివునికి నందికి మధ్యలో నడవకూడదు. ఆలయానికి వెళ్ళినప్పుడు వస్త్రంతో లేదా షాలువాతో శరీరాన్ని కప్పుకోవాలి. గంజి బట్టలను ధరించి దేవుడి దర్శనానికి వెళ్ళకూడదు. రిక్త హస్తాలతో దేవాలయం దర్శించ కూడదు. దేవాలంలో స్వార్ధంతో కూడిన మాటలు, ప్రవర్తన ఉండ కూడదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రాణిని దైవంగా భావించాలి.

ఆలయం వెలుపల ఉండే యాచకులకు తోచిన సహాయం తప్పక చేయాలి. ఇంటి నుండి తయారు చేసుకుని తీసుకువెళ్ళిన ప్రసాదాన్ని పంచి పెట్టాలి. గుడికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధంగా ఉండే దుస్తులను ధరించి లోపలికి వెళ్ళాలి. మహిళలు తప్పక కుంకుమ బొట్టు ధరించాలి. స్టికర్ లు పెట్టరాదు, ముత్తైదువలు కాళ్ళకు పారాణి ధరించాలి, తలలో ఏదేని పువ్వులను ధరించాలి. మహిళలు జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్లకూడదు. మాసిన విరిగిన వస్త్రాలు ధరించి దేవాలయాలకు వెళ్ళకూడదు. గుడికి వెళ్ళినప్పుడు ధ్వని స్తంభాన్ని దర్శించుకుని మూడు ప్రదక్షిణలు చేయాలి. అలాగే గుడి చుట్టూ ఏర్పాటు చేసిన బలి పీఠాలను తాకకూడదు. గుళ్ళో దేవునికి ఎదురుగా సాష్టాంగ నమస్కారం చేయకూడదు.