Site icon HashtagU Telugu

Lakshmi Devi: మీ ఇంట్లో ఇవి పాటిస్తే చాలు.. లక్ష్మి అనుగ్రహంతో కోటీశ్వరులవడం ఖాయం?

Mixcollage 10 Jul 2024 04 01 Pm 7255

Mixcollage 10 Jul 2024 04 01 Pm 7255

హిందువులు లక్ష్మీ అనుగ్రహం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పూజలు చేయడంతో పాటు ఎన్నో రకాల పరిహారాలు కూడా పాటిస్తూ ఉంటారు. దానధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని లక్ష్మీ అనుగ్రహం కలగలేదని దిగులు చెందుతూ ఉంటాడు. కానీ ఇంట్లో కొన్ని రకాల పరిహారాలు,నియమాలు పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు కోటీశ్వరులు అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు. ఇంతకీ ఇంట్లో ఎలాంటి నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే డబ్బు నిలుస్తుందట.

ఈ పరిహారం చేయడానికి ముందుగా ఇంటి ఇల్లాలు ఉదయాన్నే నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇంట్లో పూజ గదిలో ఉన్న లక్ష్మీ ఫోటో ముందు ఒక బిర్యానీ ఆకును పెట్టి పూజించాలి. అయితే మనం ఉపయోగించిన వంటింట్లో ఉన్న బిర్యానీ ఆకులు కాకుండా అప్పటికప్పుడు స్టోర్ లో కొనుగోలు చేసిన బిర్యాని ఆకుని మాత్రమే పూజలు ఉపయోగించడం మంచిది. పూజ అయిన తరువాత ఆ బిర్యానీ ఆకును మీ జేబుులో లేదా పర్సులో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. మనలో చాలా మందికి ఇంటి స్థలం వున్నా కూడా ఇల్లు కట్టుకోవడానికి చేతిలో డబ్బు వుండదు. అలాంటి వారు శువ్రవారం రోజున మట్టితో తయారు చేసిన ఒక నీటి కుండను తెచ్చుకొని ఇంటి ఈశాన్య దిశలో పెట్టుకోవాలి.

ఇలా పెట్టడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. చాలామంది ఇంట్లోకి కాళ్లు కడుక్కోకుండా అలాగే వస్తూ ఉంటారు.. బయట ఎక్కడెక్కడో తిరిగి ఇంట్లోకి కాళ్లు కడగకుండా అలాగే ప్రవేశిస్తూ ఉంటారు.. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి బయట నుంచి వచ్చిన తర్వాత తప్పకుండా ఇంట్లోకి కాళ్లు కడుక్కొని మాత్రమే వెళ్లాలి. తులసి మొక్కను పూజించడం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్కలో సాక్షాత్తు లక్ష్మీదేవే నివసిస్తుంది. 5 తులసి ఆకులను తీసుకొని వాటిని ఎర్రటి గుడ్డులో చుట్టి బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు వున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు ఆదాయానికి మించి ఖర్చు చేస్తున్నట్టు మీకనిపిస్తే మీ కాలికి నల్లదారాన్ని కట్టుకోవాలి.

ఇలా కట్టుకోవడం వల్ల మీకు ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే నరదృష్టి కూడా తగలకుండా వుంటుంది. స్త్రీలు ఎడమకాలికి, పురుషులు కుడి కాలికి మాత్రమే నల్లదారాన్ని కట్టుకోవాలి. రోజూ పూజ చేయకపోయినా సోమవారం పూజ చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినట్టేనని శాస్త్రం మనకు చెబుతుంది. శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. దేవతలందరూ ఆరాధించేది కూడా శివుడినే. కాబట్టి సోమవారం శివుడికి పూజచేస్తే దేవతలందరి ఆశీస్సులను అందుకుంటారు. అప్పుల బాధలు తీరాలనుకునేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే తమ అప్పుల బాధలు తీరిపోతాయట. శుక్రవారం సాయంత్రం స్నానం చేసిన తరువాత ఒక గిన్నె నెండా రాళ్ల ఉప్పును పూసి దానిపైన 2 లవంగాలను కూడా వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టుకోవాలి. తరువాత శనివారం రోజున ఈ ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి, లేదా వాటర్ సింక్లో పడేయాలి. ఇలా మూడు శుక్రవారాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు వుండవు.