Site icon HashtagU Telugu

VRISHABHA SANKRANTI 2023 : సూర్యుడి ఆశీర్వాదం కావాలా.. బీ రెడీ

Vrishabha Sankranti 2023

Vrishabha Sankranti 2023

సంక్రాంతి అంటే ఏమిటి ? సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారిన తేదీని సంక్రాంతి అంటారు. సూర్యభగవానుడు ప్రవేశించే రాశిచక్రం లేదా  గ్రహం పేరు మీద ఆ  సంక్రాంతికి పేరు(VRISHABHA SANKRANTI 2023) వస్తుంది. ప్రస్తుతం  మేషరాశిలో ఉన్న సూర్యుడు మే 15న (సోమవారం) ఉదయం 11.58 గంటలకు వృషభరాశిలోకి ఎంటర్ అవుతాడు.  దీన్నే “వృషభ సంక్రాంతి” అంటారు. ఈ టైమ్ లో పుణ్యకాల, మహాపుణ్యకాలాలలో స్నానం, దానం చేయడంతో పాటు సూర్యభగవానుడిని పూజించడం వల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు తొలగిపోతాయి. వృషభ సంక్రాంతి శుభ సమయం యొక్క మొత్తం వ్యవధి 7 గంటల 3 నిమిషాలు. ఈ రోజు తెల్లవారుజామున 04.55 గంటల నుంచి 11.58 గంటల వరకు శుభ ముహూర్తాలు ఉంటాయి. వృషభ సంక్రాంతి రోజున జరిగే మహా పుణ్యకాల మొత్తం వ్యవధి 2 గంటల 14 నిమిషాలు. ఈ రోజున మహాపుణ్యకాలం ఉదయం 09:44 గంటలకు ప్రారంభమై 11:58 గంటలకు ముగుస్తుంది. వృషభరాశిలో సూర్యుడి  సంచారం అనేది 12 రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ రాశిలో సూర్యుడు  జూన్ 15 వరకు ఉంటాడు. జూన్ 15న సాయంత్రం 06.29 గంటలకు మిథునరాశిలోకి సూర్యుడు  వెళ్తాడు.

ALSO READ : Lord Shiva Tulsi leaves : శివ పూజలో తులసి ఎందుకు నిషిద్ధమో.. తెలుసా ?

వృషభ సంక్రాంతి రోజున ఇవి చేయండి..