Site icon HashtagU Telugu

Dreams: మీకు కూడా కలలో గబ్బిలాలు కనిపించాయా.. అయితే జరగబోయేది ఇదే?

Mixcollage 19 Jan 2024 08 13 Pm 5369

Mixcollage 19 Jan 2024 08 13 Pm 5369

సాధారణంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. కలలో మనుషులు పక్షులు జంతువులు వాతావరణం ఇలా ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. అలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అయితే మామూలుగా కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. అయితే మీకు ఎప్పుడైనా కలలో గబ్బిలాలు కనిపించాయా. ఒకవేళ కనిపించి ఉంటే దాని అర్థం ఏమి? కలలో గబ్బియాలు కనిపించడం వల్ల ఏం జరుగుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

జ్యోతిషశాస్త్రంలో గబ్బిలాలను చూడటం అశుభంగా భావిస్తారు. అయితే మనం వీటినెప్పుడూ చూడకూడదు అనే వాటిని కూడా కలలో చూస్తుంటాం. వీటిలో గబ్బిలాలు ఒకటి. కలలో గబ్బిలాలు కనిపించడం అశుభంగా భావిస్తారు. అయితే కలలో మిమ్మల్ని గబ్బిలాలు దాడి చేయడం అన్నది చెడుగా భావించాలి. మీకు ఈ కలలో ఇలా కనుక వస్తే మీరు ఏదో చెడు వ్యసనానికి బలైపోతారని అర్థం. అంతేకాదు ఒక వ్యక్తి గురించి మీరు చెడుగా అనుకునే అవకాశం కూడా ఉంది.

కలలో మీరు గబ్బిలాలను చూసినట్టేతై మీకేదో చెడు జరగబోతుందని అర్థం. ఈ కల చెడుకి సంకేతం. ఈ కల మిమ్మల్ని ఒక పెద్ద భయం చుట్టుముట్టిందని సూచిస్తుంది. దీని గురించి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరెప్పుడైనా మీ కలలో గబ్బిలాల గుంపును చూసారా? అయితే మీ విధి మిమ్మల్ని విడిచిపెట్టబోతోందని అర్థం. అలాగే ఈ కల మీకు అస్సలు మంచిది కాదు. ఇలాంటి కలను చూసిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అది మీరు ఉద్యోగంలో వ్యాపారంలో నష్టపోవడాన్ని సూచిస్తుంది.