Bats: కలలో గబ్బిలాలు కనిపిస్తే ఏమి జరుగుతుందో తెలుసా?

సహజంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే, మరికొన్ని చెడ్డ కలలు వస్తుంటాయి. కొందరు మంచి క

Published By: HashtagU Telugu Desk
Mixcollage 13 Dec 2023 03 57 Pm 9216

Mixcollage 13 Dec 2023 03 57 Pm 9216

సహజంగా మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో రకాల కలలు వస్తూ ఉంటాయి. అందులో కొన్ని మంచి కలలు వస్తే, మరికొన్ని చెడ్డ కలలు వస్తుంటాయి. కొందరు మంచి కలలు వచ్చినప్పుడు సంతోషపడడం మరికొందరు చెడ్డ కలలు వచ్చినప్పుడు భయపడడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే మనకు కలలు మనుషులు జంతువులు పక్షులు అనేక రకాల వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. కలలో కనిపించే ప్రతి ఒక్క వస్తువు జీవికి ఒక అర్థం ఉంది అంటున్నారు స్వప్న శాస్త్ర నిపుణులు. అయితే మరి మనం పడుకున్నప్పుడు కలలో గబ్బిలం కనిపిస్తే ఏం జరుగుతుంది? అలా కనిపించడం దేనికి సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కలలో గబ్బిలాలు కనిపించడం అశుభంగా భావిస్తారు. అయితే కలలో మిమ్మల్ని గబ్బిలాలు దాడి చేయడం చెడుగా భావించాలంటున్నారు జ్యోతిష్యులు. మీకు ఈ కల పడితే మీరు ఏదో చెడు వ్యసనానికి బలైపోతారని అర్థం. అంతేకాదు ఒక వ్యక్తి గురించి మీరు చెడుగా అనుకునే అవకాశం కూడా ఉంది. మీ కలలో మీరు గబ్బిలాలను చూసినట్టేతై మీకేదో చెడు జరగబోతుందని అర్థం వస్తుంది. ఈ కల చెడు సంకేతం అంటున్నారు జ్యోతిష్యులు. ఇలాంటి కల మీరు భవిష్యత్తులో జరిగే అశుభ ఘటనల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అర్థం వస్తుందట. ఈ కల మిమ్మల్ని ఒక పెద్ద భయం చుట్టు ముట్టిందని సూచిస్తుంది.

దీని గురించి మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మీరెప్పుడైనా మీ కలలో గబ్బిలాల గుంపును చూసారా? అలా మీకు కలలో గబ్బిలాల గుంపు కనిపిస్తే అది మీ విధి మిమ్మల్ని విడిచిపెట్టబోతోందని అర్థం. అలాగే ఈ కల మీకు అస్సలు మంచిది కాదట. ఇలాంటి కలను చూసిన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కల మీరు ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టపోవడాన్ని సూచిస్తుంది.

  Last Updated: 13 Dec 2023, 03:58 PM IST