Site icon HashtagU Telugu

Bathing Vastu Rules: స్నానం చేసేటప్పుడు ఈ 4 పొరపాట్లు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!

Bathing Vastu Rules

Bathing Vastu Rules

వాస్తు ప్రకారంగా ఎన్నో రకాల నియమాలు ఉన్న విషయం తెలిసిందే. వాటిలో స్నానం చేయడానికి కూడా కొన్ని రకాల నియమాలు ఉన్నాయి. స్నానం చేసేటప్పుడు అలాగే స్నానం చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదట. ఆ అలవాట్లను మానుకోకపోతే రాహు కేతువుల నుంచి చెడు దృష్టి దురదృష్టం వంటివి కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఇంతకీ స్నానం చేసిన తర్వాత ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా మనం ప్రతి రోజు స్నానం చేస్తూ ఉంటాం.. దీనివల్ల సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

అయితే స్నానం చేసిన తర్వాత చేయకూడని పొరపాట్లు ఏంటి అన్న విషయానికొస్తే.. వాస్తు ప్రకారం స్నానం చేసేటప్పుడు చెప్పులని వేసుకోకూడదట. స్నానం చేసేటప్పుడు చెప్పుల్ని తొలగించి ఆ తర్వాత మాత్రమే స్నానం చేయాలని చెబుతున్నారు. స్నానం చేసేటప్పుడు చెప్పులను ధరించడం అశుభ ఫలితాన్ని అందిస్తుందట. అదేవిధంగా చాలామందికి స్నానం చేసేటప్పుడు సబ్బు నురగ నీళ్లలో పడుతుంది. తర్వాత ఆ నీళ్లను బాత్రూంలో అలాగే వదిలేస్తే రాహు కేతువుల చెడు ప్రభావం కుటుంబం పై పడుతుంది. దురదృష్టం కలగడంతో పాటుగా చెడు కన్ను మీపై పడుతుందట. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

బాత్రూంలో ఖాళీ బకెట్ ని అలాగే వదిలేయకూడదట. అలా వదిలేయడం వలన ప్రతికూల ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఒకవేళ స్నానం చేసిన తర్వాత బకెట్ ని అక్కడే వదిలేయాల్సి వస్తే తిరగేసి పెట్టాలట. ఒకవేళ ఖాళీ బకెట్ ని వదిలేస్తే ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదేవిదంగా బాత్రూం మురికిగా ఉన్నట్లయితే, అది అశుభ ఫలితాలను అందిస్తుందట. ఎప్పుడూ కూడా బాత్రూం శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలట. లేదంటే ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పండితులు హెచ్చరిస్తున్నారు.