Lakshmi Devi: లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే తులసి ఆకుతో ఈ చిన్న పరిహారం పాటించాల్సిందే?

హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తిశ్రద్ధలతో తులసి మొక్కకు పూజలు చే

Published By: HashtagU Telugu Desk
Mixcollage 18 Feb 2024 09 08 Pm 1783

Mixcollage 18 Feb 2024 09 08 Pm 1783

హిందువులు తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా నిత్యం ప్రతిరోజు ఉదయం సాయంత్రం భక్తిశ్రద్ధలతో తులసి మొక్కకు పూజలు చేస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేక దినాల్లో తులసి మొక్కను ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ మొక్క ఉన్న ఏ ఇంట్లోనూ పేదరికం సంభవించదు. అందుకే ప్రతిరోజూ కోట్లాది మంది తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. మీరు ఒకవేళ డబ్బులు సరిపోకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తులసితో గొప్ప పరిహారం చేసుకోవచ్చు. తులసిని పూజిస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చాలామంది చదువుతూ ఉంటారు.

లక్ష్మీ అనుగ్రహం కలగాలి అంటే తులసి ఆకుతో కొన్ని రకాల పరిహారాలు పాటించారట. ఆ పరిహారాలు ఏవి అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం కావాల్సినవి 11 తులసి ఆకులు అవసరం. పగటిపూట 11 పచ్చి తులసి ఆకులను ఎంచుకొని కడిగి ఎండలో ఆరబెట్టాలి. సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి. ఆ ఆకులతో మాల తయారుచేసి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి. డబ్బులు సరిపోక ఇబ్బంది పడుతున్నట్లయితే తులసి ఆకులను ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ పర్సు లేదా డబ్బులుంచే అల్మారాలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి కుటుంబానికి ధన వర్షం కురుస్తుంది.

కొందరు ఏ పని ప్రారంభించాలన్నఅందులో ఉండే ప్రతికూల అంశాలనే చూస్తుంటారు. నాలుగైదు తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడిపాత్రలో వేస్తే చాలు. ప్రతికూల శక్తి తగ్గి సానుకూలశక్తి పెరుగుతుంది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మంమీద, ఇతర ప్రదేశాల్లో తులసి ఆకులతో చల్లుకోవాలి. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగడంతోపాటు కోరిన కోర్కెలన్నీ నెరవేరతాయి. ఈ విధంగా పైన చెప్పిన పరిహారాలు పాటించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలగడంతో పాటు అదృష్టం పట్టిపీడించడం ఖాయం.

  Last Updated: 18 Feb 2024, 09:09 PM IST