Balram Jayanti : శ్రీకృష్ణుడి అన్నయ్య జయంతి నేడే.. బలరాముడి గొప్పతనం తెలుసా ?

Balram Jayanti : శ్రీకృష్ణుడి అన్నయ్య బలరాముడి జయంతి వచ్చేసింది. 

  • Written By:
  • Publish Date - September 4, 2023 / 11:50 AM IST

Balram Jayanti : శ్రీకృష్ణుడి అన్నయ్య బలరాముడి జయంతి వచ్చేసింది. ఇవాళ  (సెప్టెంబర్ 4) సాయంత్రం 04:41 గంటల నుంచి సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 3:46 గంటల వరకు బలరామ జయంతి చేసుకోవచ్చు. బలరాముడి ఇష్టమైన ఆయుధం నాగలి.  అందుకే ఆయన జయంతిని రైతులు శుభప్రదంగా భావిస్తారు. ఈ జయంతి రోజున రైతులు వారి ఎద్దులను పూజిస్తారు. ఈ రోజున స్త్రీలు తమ కుమారుల దీర్ఘాయువు కోసం ఉపవాసం పాటించి గణేశుడిని, పార్వతీ దేవిని ప్రార్థిస్తారు.

Also read : Voice Of ISRO: ఇస్రో కౌంట్‌డౌన్ వాయిస్ మూగబోయింది.. శాస్త్రవేత్త వలర్మతి మృతి

దేవతలు విష్ణువును శరణు వేడితే..

కంసుడిని వధించాలని దేవతలు విష్ణువును శరణు వేడితే.. తాను బలరామ కృష్ణులుగా వసుదేవుడు, దేవకి దంపతులకు జన్మించి కార్యం చేపడతానని చెబుతాడు. బలరామ కృష్ణులుగా జన్మించడానికి తన తలలోని తెల్లవెంట్రుకను బలరాముడిగా, నల్లవెంట్రుకను కృష్ణుడిగా  మార్చేసి దేవకి గర్భంలోకి విష్ణువు  చేర్చుతాడు. పుట్టబోయే శిశువుకు కంసుడి ద్వారా ప్రమాదం ఉందని భావించి ..బిడ్డ పుట్టకముందే గర్భ మార్పిడి ప్రక్రియ ద్వారా దేవకి గర్భాన్ని గోకులంలో ఉన్న రోహిణిలోకి చేరుస్తారు.  ఆ విధంగా రోహిణి గర్భాన జన్మించిన బలరాముడు, శ్రీకృష్ణుడు.. పుట్టగానే గోకులానికి చేరుతారు. తన తమ్ముడైన కృష్ణుడికి నీడలాగ  బలరాముడు ఉంటూ పెరిగాడు.నాగలిని తన ఆయుధంగా చేసుకున్న బలరాముడు గొప్ప యుద్ధ వీరుడు. గదా విద్యలో నిష్ణాతుడు. భీముడు, దుర్యోధనుడు ఇద్దరూ కూడా బలరాముడిని గురువుగా భావించి గదా విద్యను అభ్యసించినవారే.

Also read : WordPad Removed : ‘వర్డ్‌ప్యాడ్‌’ గుడ్ బై.. 30 ఏళ్ల జర్నీకి ముగింపు పలికిన మైక్రోసాఫ్ట్‌

ఆ శాపం తర్వాత.. 

నారదుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు ఒకసారి ద్వారకకు వస్తారు. అయితే వాళ్ళను హేళన చేయడానికి కొందరు ఒక మగవాడికి చీరకట్టి అతనికి గర్భం ఉన్నట్టు పెద్ద కడుపు ఏర్పాటు చేసి ఆ మహర్షులకు చూపుతూ ఈమెకు పుట్టేది ఏ శిశువో చెప్పండి అని అడుగుతారు. ఈవిషయం వారికి అర్థమై కోపంతో.. ఒక రోకలి జన్మించి యాదవ వంశాన్ని నాశనం చేస్తుందని శపిస్తారు. ఆ తర్వాత తరువాత మహాభారత యుద్ధం జరగడమూ, యుద్ధం తరువాత యాదవులలోనే ఒకరిని మరొకరు చంపుకోవడం జరుగుతుంది. ఇదంతా చూసిన బలరాముడు (Balram Jayanti) వైరాగ్యంతో ధ్యానంలోకి వెళ్ళి నిర్యాణ్యం పొందుతాడు.

గమనిక: ‘ఈ కథనంలో ఉన్న ఏదైనా సమాచారం/మెటీరియల్/లెక్కల యొక్క ఖచ్చితత్వం లేదా విశ్వసనీయతకు హామీ లేదు. ఈ సమాచారం వివిధ మాధ్యమాలు/జ్యోతిష్యులు/పంచాంగాలు/ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.