Sankatahara Chaturthi: సంకష్టహర చతుర్థి ఎప్పుడు.. గణపతి అనుగ్రహం కావాలంటే ఏం చేయాలో మీకు తెలుసా?

విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలంటే సంకష్టహర చతుర్థి రోజున ఏం చేయాలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Published By: HashtagU Telugu Desk
Sankatahara Chaturthi

Sankatahara Chaturthi

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో సంకష్టహర చతుర్థి పండుగ కూడా ఒకటి. ఈ సంకష్టహర చతుర్ధిని ప్రతినెల కృష్ణపక్ష చతుర్థి రోజున జరుపుకుంటూ ఉంటారు.. ఈరోజున గణేష్ ని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఉపవాసం కూడా ఉంటారు. అయితే ఆయన ఆశీర్వాదం తప్పకుండా కలగాలి అంటే నియమనిష్టలతో ఆయనను పూజించాలి. సంకష్టహర చతుర్థి రోజున విఘ్నేశ్వరుని పూజించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయట. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయట. కుటుంబంలో ఆనందం నెలకొంటుందని నమ్ముతారు.

భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం కూడా పాటిస్తారు పాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్థి తిధి మార్చి 17, సోమవారం సాయంత్రం 07:33 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది మార్చి 18 మంగళవారం రాత్రి 10:09 గంటలకు ముగుస్తుంది. ఈ రోజున చంద్రోదయ సమయంలో పూజలు కూడా నిర్వహిస్తారు. అటువంటి పరిస్థితిలో బాల చంద్ర సంకటహర చతుర్థి మార్చి 17న మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుందట. ఏ వస్తువులు దానం చేయాలి అన్న విషయానికి వస్తే.. పేదలకు, అవసరం ఉన్న వారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తులను దానం చేయాలట.
బియ్యం, గోధుమలు, పప్పులు సహా ఇతర ధాన్యాలను దానం చేయవచ్చని చెబుతున్నారు. ఇక గణపతి పూజ చేసేవారు పూజలో పండ్లు స్వీట్లు సమర్పించి ఆ తర్వాత వాటిని పేదలకు పంచడం మంచిదని చెబుతున్నారు.

అలాగే మీకు ఉన్నంతలో పేదలకు అవసరం ఉన్నవారికి డబ్బును దానం చేయవచ్చు అని చెబుతున్నారు. చిన్నపిల్లలకు పుస్తకాలు స్టేషనరీ వస్తువులు విరాళంగా కూడా ఇవ్వవచ్చట. ఆవులు, కుక్కలు, ఇతర జంతువులకు ఆహారాన్ని దానం చేయవచ్చని చెబుతున్నారు. దాహం వేసిన వారికి నీరు ఇవ్వడం అంటే వేసవిలో దాహార్తి తీర్చడానికి మంచి నీటి స్టాల్స్ ఏర్పాటు చేయవచ్చట. వేసవికాలంలో అవసరమైన వారికి గొడుగులు లేదా చెప్పులను దానం చేయవచ్చు అని చెబుతున్నారు. నెయ్యి దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందట. బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందట. అలాగే అదృష్టం కలుగుతుందని చెబుతున్నారు. దానం చేసేటప్పుడు స్వార్థం ఉండకూడదని,పేదలకు మాత్రమే దానం చేయాలని ఎవరిని అవమానించకూడదని, శక్తి సామర్ధ్యాల మేరకు మాత్రమే దానం చేయాలని చెబుతున్నారు. ఎవరి శక్తి సామర్థ్యం మేరకు దానం చేయాలట. అలాగే దానధర్మాలు వంటివి రహస్యంగా చేయాలట. పైన చెప్పిన విషయాలు తప్పకుండా పాటిస్తే విగ్నేశ్వరుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

  Last Updated: 17 Mar 2025, 12:16 PM IST