Site icon HashtagU Telugu

Vastu tips: మీ ఇంటి దగ్గర ఇటువంటి చెట్లు ఉన్నాయా.. అయితే మీకు ధననష్టంతో పాటు దరిద్రం కూడా?

Vastu Tips

Vastu Tips

సాధారణంగా మన ఇంటి చుట్టూ అలాగే మన ఇంటి వాతావరణంలో ఎన్నో రకాల మొక్కలు, చెట్లను పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని రకాల మొక్కలను వాస్తు ప్రకారంగా నాటుతూ ఉంటారు. మరికొన్ని మొక్కలు తెలిసి తెలియక నాటుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల మొక్కలు ఆర్థిక సమస్యలను దూరం చేస్తే మరి కొన్ని మొక్కలు ఆర్థిక సమస్యలను తీసుకురావడంతో పాటు దరిద్రం వెంటాడేలా చేస్తాయి. ఒకవేళ మీ ఇంటి చుట్టూ కీడు కలిగించే చెట్లు వెంటనే వాటిని తొలగించాలి. మరి ఇంటి ఆవరణలో ఎటువంటి మొక్కలు చెట్లు ఉండకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందా… వాస్తు శాస్త్ర ప్రకారం మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కాక్టస్ మొక్కలను నాటకూడదు.

చాలామంది వీటిని అలంకరణ కోసం నాటుతూ ఉంటారు. కానీ ఈ మొక్కలను ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచడం వల్ల బాధలు ఇంట్లో చికాకుల మొదలవుతాయి. అంతేకాకుండా ఇంట్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పాటు కలహాలు గొడవలు మొదలవుతాయి. అలాగే ఇంటీ వాతావరణం ఆవరణలో తుమ్మ చెట్లు ఉండకూడదు. తుమ్మ చెట్లు ఉండడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. అలాగే ఇంటి సభ్యులు ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపుతుంది. అలాగే ఇంటి పరిసర ప్రాంతాల్లో రేగు చెట్టు ఉంటే కష్టాలు పెరుగుతాయి. రేగు చెట్టులో ఉండే ముళ్ళ కారణంగా ఇంట్లో ప్రతికూలత జరుగుతుంది. ఆర్థిక సంక్షోభం మొదలవ్వడంతో పాటు ఇంట్లో లక్ష్మీ దేవత నివసించదు. అలాగే ఇంటీ దగ్గర నిమ్మ, ఉసిరి చెట్లు లేకుండా చూడాలి.

ఇవి ఉండడం వల్ల ఇంట్లో కష్టాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతాయి. అందుకే ముళ్ళున్న పూలు, పండ్ల చెట్లు ఇంట్లో ఉంటే ఏది కలిసి రాదన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇంట్లో ఎటువంటి మొక్కలు ఉండాలి అన్న విషయానికి వస్తే.. మనీ ప్లాంట్, తూజా మొక్క, కుబేరాక్షి మొక్కలు ఇంట్లో ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ మొక్కలు ఇంటికి అదృష్టం తెచ్చి పెట్టడంతో పాటు ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉండేలాగా చూసుకుంటాయి.

Exit mobile version