Ayyappa Pancharatnam: అయ్యప్ప అనుగ్రహం కోసం ఈ పంచరత్న స్తోత్రాన్ని పఠించండి..!!

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 06:15 AM IST

అయ్యప్ప పంచరత్నం అనగా అయ్యప్ప స్వామికి సంబంధించిన ఐదు ఆభరణాలు అని అర్థం. ఈ పంచరత్నం స్తోత్రంలో ప్రతి శ్లోకాన్ని రత్నంగా భావిస్తారు. అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలనుకుంటే పంచరత్న స్తోత్రాన్ని తప్పకుండా పఠించాలి.

 అయ్యప్ప పంచరత్నం:
లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం |
పార్వతీ హృదయానందం శాస్త్రం ప్రణమామ్యహం || 1 ||

విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ |
క్షిప్రప్రసాదనిరతం శాస్త్రం ప్రణమామ్యహమ్ || 2 ||

భగవద్గీత: వీటి వల్ల కోపం, అసూయ నశిస్తాయి అంటాడు శ్రీకృష్ణుడు..!
మత్తమాతంగాగమనం కారుణ్యమరితపూరితమ్ |
సర్విఘ్నహరం దేవం శస్తారం ప్రణమామ్యహమ్ || 3 ||

అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు విషాననం |
అస్మాదిష్టప్రదాతారం శాస్త్రం ప్రణమామ్యహమ్ || 4 ||

పాండీశవంశతిలకం కేరళ కేళివిగ్రహం |
అర్థత్రణాపరం దేవం శస్త్రం ప్రణమామ్యహమ్ || 5 ||

పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా నివాసం మనసే ||

||ఇతి శ్రీ అయ్యప్ప పంచరత్నం ||

ఈ స్తోత్రాన్ని జపించడానికి ఉత్తమ రోజు:
మీరు ప్రతిరోజూ మంత్రాన్ని పఠించడం వీలు కాకపోతే…మీరు బుధవారాలు, ఆదివారాలు, షష్టి తిథి రోజులు, ఉత్తర ఫాల్గుణి లేదా కార్తీక నక్షత్రం రోజులలో ఈ స్తోత్రాన్ని పఠించవచ్చు. అలాగే, కార్తీక (నవంబర్ మధ్య నుండి డిసెంబర్ మధ్య వరకు) అని పిలువబడే హిందూ చాంద్రమానమైన మకర మాసంలో అయ్యప్ప పంచరత్నాన్ని పఠించవచ్చు.

ఉత్తమ సమయం:
మీకు వీలైనప్పుడు మంత్రాన్ని జపించవచ్చు. అయితే, ఈ మంత్రాన్ని జపించడానికి ఉత్తమ సమయం తెల్లవారుజామున లేదంటే సంధ్య కాలంలో జపించవచ్చు.

పంచరత్నం ఎన్నిసార్లు చదవాలి?
ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు పఠించాలనడానికి ఎలాంటి పరిమితి లేదు. అయితే, మీరు దీనిని రోజుకు 9 సార్లు, 11 సార్లు లేదా 108 సార్లు పఠించవచ్చు. ఈ స్తోత్రాన్ని లింగం లేదా వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా పఠించవచ్చు.

అయ్యప్ప స్వామి పంచరత్నం స్తోత్రం పఠించడం ద్వారా అయ్యప్పస్వామి అనుగ్రహం పొందుతారు. ఈ స్తోత్రం అయ్యప్ప స్వామికి ఎంతో ఇష్టమైంది. చదివేందుకు కూడా చాలా సులభంగా ఉంటుంది.