Ayodhya: క్రేన్ సహాయంతో గర్భగుడి వద్దకు చేరుకున్న రామ్ లల్లా.. కొద్దిసేపట్లో ప్రత్యేక పూజలు ?

తాజాగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి వద్దకు రామ్ లల్లా చేరుకున్నారు. అంతేకాకుండా మరికొద్ది సేపట్లో రామ్ లల్లా ప్రతిష్ట సందర్భ

Published By: HashtagU Telugu Desk
Mixcollage 18 Jan 2024 05 42 Pm 3619

Mixcollage 18 Jan 2024 05 42 Pm 3619

తాజాగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి వద్దకు రామ్ లల్లా చేరుకున్నారు. అంతేకాకుండా మరికొద్ది సేపట్లో రామ్ లల్లా ప్రతిష్ట సందర్భంగా గర్భగుడిలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించనున్నారు. అనంతరం క్రేన్ సాయంతో బాల రామయ్య విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొని వెళ్లనున్నారు. నేపాల్ లోని కాళీ నది నుంచి తీసుకొచ్చిన సాలిగ్రామ శిలతో తయారు చేసిన 51 అంగుళాల విగ్రహాన్ని గుడిలోకి చేర్చిన అనంతరం ఆలయాన్ని శుద్ధి చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత జనవరి 22న ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతుల మీదుగా ఆలయంలో స్వామివారికి కుంకుమార్చన జరగనుంది.

రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టలో చేసే పవిత్ర కార్యక్రమంలో భాగంగా బుధవారం తెల్లవారుజామున స్థానిక మహిళలు మహా కలశ యాత్రను చేపట్ట నున్నారు. ఆ తర్వాత పూజలు చేసి రామాలయ ప్రాంగణంలోకి రామ్ లల్లా విగ్రహాన్ని తీసుకుని వెళ్లనున్నారు. ఈ రామ్ లల్లా విగ్రహం దాదాపుగా 200 కిలోల బరువు ఉంటుందని చెబుతున్నారు. విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్లే ముందు యాగ మండపంలోని 16 స్తంభాలు, నాలుగు ద్వారాలకు పూజలు చేశారు. ఆ భారీ విగ్రహాన్ని ట్రక్కులో ఆలయానికి తీసుకువచ్చి క్రేన్‌తో పూజా కార్యక్రమాలను నిర్వహించి అనంతరం ఆలయం లోపల ఉంచారు.

ప్రతిష్ఠాపన కార్యక్రమం జనవరి 16న ప్రారంభమైంది. జనవరి 22 వరకు కొనసాగుతుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రారంభోత్సవం కార్యక్రమానికి ముందు హిందూ సంప్రదాయాల ప్రకారం అనేక పూజాదికార్యక్రమాలు, అనేక ఆచారాలు నిర్వహించబడతాయి. ఆలయ ప్రాంగణ లోకి బాల రామయ్య విగ్రహాన్ని తరలించే సమయంలో చేసే క్రతువులో ప్రధాన ఆచార్య పీఠం లక్ష్మీకాంత దీక్షితులు పాల్గొన్నారు. 16 స్తంభాలు 16 దేవుళ్లకు చిహ్నాలు అని చెప్పారు. మండపం నాలుగు ద్వారాలు నాలుగు వేదాలను సూచిస్తాయని అదేవిధంగా ప్రధాన ద్వారం వద్ద ఉన్న ఇద్దరు ద్వారపాలకులు నాలుగు వేదాలలోని రెండు శాఖలకు ప్రతినిధులని పేర్కొన్నారు.

  Last Updated: 18 Jan 2024, 05:43 PM IST