Ayodhya : అయోధ్య రామమందిరానికి రూ.ఎన్ని కోట్లు ఖర్చయ్యాయో శాఖ అవడం ఖాయం?

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న వైభవంగా జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయం కోసం దేశవ్యాప్తంగా ఉ

  • Written By:
  • Publish Date - January 19, 2024 / 03:00 PM IST

ఉత్తర్‌ప్రదేశ్‌ లోని అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న వైభవంగా జరగనున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ సమయం కోసం దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా కూడా అయోధ్య పేరే వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా అయోధ్యకు సంబంధించిన వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇకపోతే అయోధ్య గురించి తెలుసుకున్న ప్రతీ ఒక్కసారి కూడా ప్రతి ఒక్కరికి తలెత్తే ప్రశ్న అయోధ్య రామ మందిరం నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి తలెత్తే ఉంటుంది. మరి అయోధ్య రామ మందిర నిర్మాణానికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది? అన్న వివరాల్లోకి వెళితే..

మొత్తం మూడు దశల్లో రామమందిరాన్ని నిర్మిస్తుండగా తొలి దశ పనులు పూర్తికావడంతో శ్రీ రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నారు. 2025 డిసెంబరులోగా మిగతా పనులన్నీ పూర్తవుతాయి. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏడు వేల మంది హాజరుకానున్నారు. అయితే ఇప్పటి వరకు రామాలయ నిర్మాణానికి మొత్తం దాదాపు రూ.1,800 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇటీవలి కాలంలో అత్యంత ఖర్చుచేసిన నిర్మాణం ఇదే. గుజరాత్‌లో స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూ.2,989 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని రూ.836 కోట్ల అంచనా వ్యయంతో కట్టారు. అత్యధికంగా ఖర్చు చేస్తున్న రెండో కట్టడంగా అయోధ్య రామమందిరం నిలిచింది. అయోధ్యలో ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది.

సరయూ నదీ తీరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం గా చెప్పవచ్చు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపం. భవ్యరామ మందిర వైభవం దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ అయ్యింది. అత్యంత ఖరీదైన మతపర నిర్మాణాల్లో ఈ రామమందిరం ఒకటిగా నిలిచిపోనుంది. ఈ రామాలయ సముదాయం దాదాపుగా 70 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రధాన ఆలయం సుమారు 3 ఎకరాల్లో 161 అడుగుల ఎత్తులో ఉంది. మూడు అంతస్తులు, 12 ద్వారాలతో ఈ ఆలయాన్ని చాలా గొప్పగా నిర్మిస్తున్నారు.
రామమందిర నిర్మాణం కోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.. సుమారు 3,500 కోట్ల రూపాయల విరాళాలు సేకరించింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.11 లక్షలు, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 5 లక్షల రూపాయలు వ్యక్తిగతంగా విరాళం అందించారు.

ఆలయ నిర్మాణానికి మొత్తం సేకరించిన విరాళాల్లో ఇప్పటివరకు దాదాపు 52 శాతం ఖర్చయ్యింది. మిగతా సొమ్ము రాబోయేకాలంలో ఆలయ నిర్వహణ, ఇతర కార్య కలాపాలకు ట్రస్ట్‌ వినియోగించనుంది. ఆలయంతో పాటు అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం కూడా ఈ విరాళాల నుంచి కొంతభాగం ఖర్చు చేస్తున్నారు. ఇకపోతే ఏ కట్టడానికి ఎంత? అయ్యింది అన్న విషయానికి వస్తే.. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని 1,800 కోట్ల రూపాయల అంచనాతో చేపట్టారు.