Ayodhya Ramaiah : అయోధ్య రామయ్య ద‌ర్శ‌నం కోసం రోజూ ల‌క్ష‌న్న‌ర మంది

  • Written By:
  • Publish Date - March 13, 2024 / 01:26 PM IST

 

Ayodhya Ramaiah : యూపీలోని అయోధ్య‌లో ఇటీవ‌ల రామ్‌ల‌ల్లా మందిరాన్ని(Shri Ram Janmabhoomi Mandir) ప్రారంభించిన విష‌యం తెలిసిందే. అయితే ఆ ఆల‌యానికి భ‌క్తుల(Devotees) తాకిడి పెరిగింది. రామ్‌ల‌ల్లాను ప్ర‌తి రోజూ సుమారు ల‌క్ష నుంచి ల‌క్ష‌న్న‌ర మంది భ‌క్తులు ద‌ర్శించుకుంటున్నార‌ని శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర( ram janmbhoomi teerth kshetra )తెలిపింది. ఇవాళ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఆ విష‌యాన్ని చెప్పింది. భారీ సంఖ్య‌లో రాముడి ద‌ర్శ‌నం కోసం వ‌స్తున్న ప‌ర్యాట‌కుల‌కు ట్ర‌స్టు కొన్ని సూచ‌నలు చేసింది. రామ మందిరాన్ని ఉద‌యం 6.30 నిమిషాల నుంచి రాత్రి 9.30 నిమిషాల వ‌ర‌కు తెరిచి ఉంచుతున్న‌ట్లు తెలిపింది. చాలా స‌లువుగా, వీలైన రీతిలో ద‌ర్శ‌నం చేసుకోవ‌చ్చు అని, సుమారు 60 నుంచి 75 నిమిషాల్లోనే ద‌ర్శ‌నం పూర్తి అవుతుంద‌ని ట్ర‌స్టు పేర్కొన్న‌ది.

We’re now on WhatsApp. Click to Join.

ఆల‌యానికి వ‌స్తున్న భ‌క్తులు త‌మ‌తో మొబైల్ ఫోన్లు, ప‌ర్సులు తీసుకురాకూడ‌ద‌ని ట్ర‌స్టు తెలిపింది. పువ్వులు, మాల‌లు, ప్ర‌సాదాల‌ను కూడా తీసుకురావ‌ద్దు అని త‌న సూచ‌న‌లో వెల్ల‌డించింది. మంగ‌ళ‌హార‌తి ఉద‌యం 4 గంట‌ల‌కు, శృంగార్‌ హార‌తి 6.15 నిమిషాల‌కు, శ‌య‌న్ హార‌తి రాత్రి 10 గంట‌ల‌కు నిర్వ‌హించ‌నున్నారు. హార‌తి కోసం ఎంట్రీ పాసులు త‌ప్ప‌నిస‌రి.

Read Also: Telangana : బిఆర్ఎస్ పార్టీ ఖాళీ కాబోతుందా..?