Site icon HashtagU Telugu

Ayodhya: రామయ్యకు భారీగా నైవేద్యాన్ని సమర్పించిన హైదరాబాద్ వాసీ.. ఏకంగా అన్ని కిలోల లడ్డు?

Mixcollage 17 Jan 2024 05 32 Pm 9352

Mixcollage 17 Jan 2024 05 32 Pm 9352

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో ఐదు రోజుల్లో బాల రామయ్య గర్భగుడిలో కొలువుదీరనున్నారు. రామయ్య కోసం భక్తులు భారీగా కానుకలను సమర్పిస్తున్నారు. అంతేకాకుండా ఆ రామయ్య కోసం భక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 22వ తేదీ జరగబోతున్న ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సెలబ్రిటీలు రాజకీయ నాయకులు పెద్దపెద్ద ప్రముఖులు హాజరుకానున్నారు. ఇది ఇలా ఉంటే రోజులు దగ్గర పడుతున్న కొద్ది ఒక్కొక్కరు భక్తులు వారికి స్వామి వారిపై ఉన్న భక్తిని వివిధ రూపాల్లో చాటుకుంటున్నారు.

అందులో భాగంగానే తాజాగా హైదరాబాద్‌కు చెందిన నాగభూషణ్ రెడ్డి అనే వ్యక్తి 1,265 కిలోల లడ్డూను నైవేద్యంగా సమర్పించడానికి సిద్ధం చేశారు. నేడు హైదరాబాద్ నుంచి లడ్డూను అయోధ్యకు తీసుకువెళ్లనున్నారు. లడ్డూను శీతలీకరించిన గాజు పెట్టెలో పెట్టి అయోధ్యకు తీసుకుని వెళ్తున్నారు. ఈ లడ్డూను తయారు చేయడం కోసం దాదాపు 30 మంది 24 గంటల పాటు నిరంతరం శ్రమించారని నాగభూషణ్ రెడ్డి తెలిపారు. అంతేకాదు తాను 2000 నుంచి శ్రీ రామ్ క్యాటరింగ్ సర్వీస్‌ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రామ జన్మభూమి ఆలయంలో భూమి పూజ జరుగుతున్నప్పుడు తాము శ్రీ రాముడికి నైవేద్యంగా ఏమి ఇవ్వాలని అని ఆలోచినట్లు చెప్పారు.

తర్వాత రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ రోజు నుండి ఆలయం తెరిచే రోజు వరకు తాము ప్రతి రోజు 1 కేజీ లడ్డూ చొప్పున ప్రారంభోత్సవం వరకూ లెక్కించి నైవేద్యంగా లడ్డుని ఇవ్వాలని ఆలోచించినట్లు నాగభూషణ్ రెడ్డి పేర్కొన్నారు. దీంతో రామ మందిర భూమి పూజ రోజు నుంచి ప్రారంభోత్సవం వరకూ రోజులు లెక్కించి 1,265 కిలోల లడ్డూను సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ లడ్డూను రిఫ్రిజిరేటెడ్ బాక్స్ లో పెట్టి హైదరాబాద్ నుంచి అయోధ్యకు యాత్రగా తీసుకెళ్తున్నామని తెలిపారు. రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రయాణించి రామయ్యకు ఈ భారీ లడ్డుని నైవేద్యంగా సమర్పించనున్నామని వెల్లడించారు.

Exit mobile version