Site icon HashtagU Telugu

Ayodhya : భారీ భూకంపం వచ్చిన అయోధ్య రామమందిరానికి ఏమీకాదు..ఎందుకంటే ..!!

Ayodya Ram

Ayodya Ram

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం అయోధ్య (Ayodhya ) లో ఈ నెల 22 న ఆవిష్కృతం అయ్యింది. అయోధ్యలో బాలక్ రామ్ (Balak Ram) విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ వేడుకను చూసేందుకు దేశం నలుమూలల నుండి భక్తులతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఇక దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఈ వేడుకను లైవ్ ప్రసారాల్లో చూడడం చేసారు.

ఇక ఈ అయోధ్య మందిరానికి ఎంతో ప్రత్యేకత ఉంది…ఇప్పటికే చాల ప్రత్యేకతలు బయటకు రాగ..తాజాగా మరో అద్భుత విషయం బయటకొచ్చింది. ఈ ఆలయం 2500 ఏళ్లలో ఒకసారి సంభవించే అతిపెద్ద భూకంపాన్ని (Earthquake) తట్టుకునేలా రూపొందించారట. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(CBRI)-రూర్కీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) అయోధ్య సైట్‌కి సంబంధించి జియోఫిజికల్ క్యారెక్టరైజేషన్, జియోటెక్నికల్ అనాలిసిస్, ఫౌండేషన్ డిజైన్ వెట్టింగ్ మరియు 3D స్ట్రక్చరల్ అనాలిసిస్ మరియు డిజైన్‌తో సహా అనేక శాస్త్రీయ అధ్యయనాలను నిర్వహించింది.

We’re now on WhatsApp. Click to Join.

2500 ఏళ్లలో వచ్చే శక్తివంతమైన భూకంపాన్ని తట్టుకుంటుందని సీఎస్ఐఆర్-సీబీఆర్ఐ సీనియర్ శాస్త్రవేత్త దేబ్‌దత్తా ఘోష్ తెలిపారు. 50 కంటే ఎక్కువ కంప్యూటర్ మోడళ్లను సిమ్యులేట్ చేసిన తర్వాత మరియు దాని సరైన పనితీరు, నిర్మాణ ఆకర్షణ మరియు భద్రత కోసం వివిధ లోడింగ్ పరిస్థితులలో ఉన్న వాటిని విశ్లేషించిన తర్వాత స్ట్రక్చరల్ డిజైన్‌ను సిఫార్సు చేసినట్లు ఘోష్ చెప్పుకొచ్చారు. రామాలయ నిర్మాణానికి ఇనుము, ఉక్కును ఉపయోగించలేదు. వీటి కాల పరిమితి 90 ఏళ్ల వరకు మాత్రమే ఉంటుంది, అందుకనే నిర్మాణంలో వీటిని ఉపయోగించలేదన్నారు. సరయు నదీ తీరంలో నిర్మాణం ఉండటంతో భూమిలో తేమ పరిస్థితులను తట్టుకునేందుకు అత్యంత బలంగా రాయి నిర్మాణాన్ని తలపించే విధంగా పునాదిని ఏర్పాటు చేసారని , పూర్తిగా రాతితో, ఇంటర్ లాక్ టెక్నాలజీతో రామ మందిర నిర్మాణం జరిగిందని వివరించారు.

ఇదిలా ఉంటె అయోధ్య రామయ్య దర్శనం కోసం ప్రతి రోజు వేలాది మంది భక్తులు దర్శించుకుంటున్నారు. జనవరి 23 నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించడంతో అయోధ్యకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. తొలివారం అది కూడా మొదటి ఆరు రోజుల్లో దాదాపు 19 లక్షల మంది అయోధ్యను సందర్శించడం విశేషం. రామ మందిరాన్ని 18.75 లక్షల మంది యాత్రికులు సందర్శించినట్టు ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలో ఓ విశిష్ట కమిటీని ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడూ ఈ కమిటీ సమీక్షిస్తుంటుంది.

Read Also : Solar Rooftop Scheme : ‘పీఎం సూర్యోదయ యోజన’.. మీ ఇంటిపై సోలార్ ప్యానళ్లు.. అప్లై చేసుకోండి

Exit mobile version