Ayodhya: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. ఆరోజు ప్రత్యేకత ఇదే

  • Written By:
  • Updated On - April 13, 2024 / 06:45 PM IST

Ayodhya: ఏఫ్రిల్ 17న శ్రీరామ నవమి రాబోతోంది. ఆ సందర్భంగా సూర్య భగవానుడి కిరణాలు బాల రామయ్య ఫాల భాగాన్ని తాకుతాయా లేదా అనే అంశంపై అయోధ్య ఆలయ అధికారులు ఇవాళ నిర్వహించిన రిహార్సల్స్‌ విజయవంతమయ్యాయి. ఇది తమలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని రామ మందిరంలో దర్శన విభాగ ఇన్‌చార్జి గోపాల్‌ జీ చెప్పారు. ఇక శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకుతాయని ఆయన తెలిపారు.

ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు రామ్ లల్లా విగ్రహాన్ని సూర్య తిలకంతో అలంకరించేందుకు రూపొందించిన ఒక ప్రత్యేకమైన శాస్త్రీయ వ్యవస్థ. దీనిని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు సహకారంతో ఆప్టికా రూపొందించిన ప్రాజెక్ట్. ఖచ్చితమైన లెన్స్‌లు, మిర్రర్‌లతో కూడిన ప్రత్యేకమైన డిజైన్‌ను తీర్చిదిద్దారు. ఈ మూలకాలు సహజ సూర్యరశ్మిని ఉపయోగించుకుంటాయి.