Site icon HashtagU Telugu

Ram Mandir: అయోధ్య రాముడికి అతి చిన్న సూక్ష్మ పాదుకలు సమర్పించిన స్వర్ణకారుడు?

Mixcollage 21 Jan 2024 03 04 Pm 5720

Mixcollage 21 Jan 2024 03 04 Pm 5720

రేపు అనగా జనవరి 22న అయోధ్యలో బాల రామ విగ్రహ ప్రతిష్ట జరగనున్న విషయం తెలిసిందే. ఆ గడియల కోసం దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మహా గొప్ప కార్యక్రమానికి పెద్ద పెద్ద వారు హాజరు కాబోతున్న విషయం తెలిసిందే. అందుకు కేవలం మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ వేడుకకు సమయం సమీపిస్తుండడంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా రామనామ మరణ వినిపిస్తోంది. రాముడిపై భక్తిని ప్రజలు వివిధ మార్గాల్లో చాటుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది రాముడికి బంగారు పట్టు వస్త్రాలు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు ఖరీదైన కానుకలను సమర్పించిన విషయం తెలిసిందే.

తాజాగా కూడా అయోధ్యలో కొలువుదీరనున్న బాల రాముడికి నల్లగొండ జిల్లాకు చెందిన సూక్ష్మ చిత్ర కళాకారుడు బంగారు పాదుకులను రూపొందించారు. కంటికి కనిపించే అతి చిన్న సూక్ష్మమైన స్వర్ణ పాదుకలను సమర్పించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన స్వర్ణకారుడు చొల్లేటి శ్రీనివాసచారి అతిచిన్న అయోధ్యలోని రాములోరికి పాదుకలను తయారు చేశారు. అయోధ్యలో చరిత్రలో నిలిచిపోయేలా ఈ నెల 22న జరిగే బాలరాముడి విగ్రహా ప్రాణప్రతిష్ఠ, రామ మందిర ప్రారంభోత్సవ పుణ్యకార్యాన్ని పురస్కరించుకుని అతి చిన్న స్వర్ణ పాదుకులను తయారు చేశారు.

కేవలం 0.130 మిల్లీ గ్రాముల బంగారాన్ని వినియోగించి 8 మిల్లీ మీటర్‌ సైజు పొడవు, 4మిల్లీ మీటరు సైజు వెడల్పుతో రెండు పాదుకలను తయారు చేశాడు. వీటిని తయారు చేయడానికి కేవలం గంట మాత్రమే సమయం పట్టిందని స్వర్ణకారుడు శ్రీనివాసచారి చెబుతున్నాడు. శ్రీరాముడుపై ఉన్న భక్తితో తన కళను రామునికి అంకితం చేస్తూ ఈ స్వర్ణ పాదుకులను సమర్పించుకుంటున్నానని అన్నారు.