Ayodhya: అయోధ్య భక్తులు అలర్ట్.. శ్రీరామ నవమి సందర్భంగా పలు పూజలు రద్దు

  • Written By:
  • Publish Date - April 16, 2024 / 09:37 AM IST

Ayodhya:  అయోధ్యలోని రామాలయం బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంగళ హారతి నుండి రాత్రి 11 గంటల వరకు 19 గంటల పాటు తెరిచి ఉంటుంది. స్వామికి నైవేద్యాల సమయంలో ఐదు నిమిషాల పాటు ఆలయ తెరలు తీయబడుతాయి. శ్రీరామనవమి సందర్భంగా, ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే తొలి రామనవమికి భక్తులు భారీగా తరలిరానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఏప్రిల్ 19 తర్వాతే అయోధ్యను సందర్శించి రామ్ లల్లా దర్శనం చేసుకోవాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రత్యేక అతిథులకు విజ్ఞప్తి చేసింది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు రామ్ లల్లా దర్శనం, హారతి కోసం అన్ని ప్రత్యేక పాస్ బుకింగ్ లను రద్దు చేసింది. శ్రీరామనవమి రోజున తెల్లవారుజామున 3.30 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో భక్తులు క్యూలైన్లలో దర్శనానికి క్యూ కట్టేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. రాత్రి 11 గంటల వరకు భక్తులు రామ్ లల్లా దర్శనం చేసుకోవచ్చని తెలిపింది.

దర్శన సమయంలో అసౌకర్యం, సమయం వృథా కాకుండా భక్తులు తమ మొబైల్ ఫోన్లు, ఇతర విలువైన వస్తువులను తీసుకురావద్దని సూచించారు. యాత్రికుల కోసం సుగ్రీవ్ ఖిలా వద్ద ట్రస్ట్ ఒక సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పబ్లిక్ బ్రాడ్ కాస్టర్ ప్రసార భారతి రామ మందిరంలో జరిగే వేడుకలను దూరదర్శన్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.