Site icon HashtagU Telugu

Vastu Tips: పూజగది విషయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా .. అయితే ఇక అంతే సంగతులు?

Ca5dd264 B9ca 489d 9359 716cc359063d

Ca5dd264 B9ca 489d 9359 716cc359063d

రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇదివరకు వాస్తు శాస్త్రం అంటే పెద్దగా పట్టించుకోని వారు సైతం ప్రస్తుత రోజుల్లో ఇల్లు నిర్మాణ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంట్లో వస్తువుల అమరికల వరకు ప్రతి ఒక విషయంలో వాస్తు శాస్త్రాన్ని తప్పకుండా పాటిస్తున్నారు. వాస్తు శాస్త్రంలో చెప్పబడిన నియమాలు పాటించడం వల్ల మంచి జరగడంతో పాటు సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. దాంతో చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతున్నారు. ఇకపోతే వాస్తు ప్రకారం ఇంటిలోని పూజగది ఎల్లప్పుడు కూడా ఈశాన్య లేదా ఉత్తర దిశలలోనే ఉండాలి. ఆర్థిక లాభం, కుంటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం ఇంట్లో పూజగది సరైన దిశలో ఉండటం చాలా ముఖ్యం.

లేకపోతే కుబుంబంలో ఆరోగ్య సమస్యలు తప్పవు. కాగా ఇంట్లో పూజగది ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పూజ చేసే ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా ఇంట్లో కట్టుకున్న గుడి వాస్తుకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉంటే, పూజ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రతతో ఉండదు. పూజ చేయడం వల్ల ప్రయోజనం కూడా ఉండదు. అలాగే ఆ ఇంటికి దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అవుతుంది. మరి పూజ గది విషయంలో గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వాస్తు శాస్త్రం ప్రకారం, పూజగదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను పెట్టి పూజించకూడదు. ఇది అత్యంత అసహ్యకరమైనదిగా పరిగణించబడుతుంది.

అంతే కాదు విరిగిన విగ్రహాలను పూజిస్తే దేవతలకు కోపం వస్తుంది. వాస్తు ప్రకారం పూజ గది ఎప్పుడూ స్టోర్‌రూమ్, బెడ్‌రూమ్, బేస్‌మెంట్‌లో ఉండకూడదు. పూజా గది ఎల్లప్పుడూ బహిరంగ ప్రదేశంలో నిర్మించాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది సరైన దిశలో ఉండాలి. పూజగది సరైన దిశలో లేకుంటే పూజలకు ప్రయోజనం ఉండదని వాస్తు నిపుణులు అంటున్నారు. అందుకే పూజగది ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పూజగదికి దక్షిణం లేదా పడమర దిశ అశుభంగా భావించాలి. అదే సమయంలో ఇంటి గుడిలో రెండు శంఖాలను కలిపి ఉంచడం కూడా సరికాదు. అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని గుడిలో ఒకటి కంటే ఎక్కువ దేవుడి చిత్రాలను ఉంచకూడదు.

అలాగే 3 వినాయక విగ్రహాలు ఉండకూడదని గుర్తుంచుకోండి. అలా ఉండటం వల్ల వల్ల ఇంటి శుభ కార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే హనుమాన్ పెద్ద విగ్రహాన్ని పూజగది‌లో ఉంచకూడదు. పూజగదిలో హనుమాన్ విగ్రహం ఎప్పుడూ చిన్నదిగా ఉండాలి. వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా గుడి దగ్గర టాయిలెట్లు కట్టకండి. చాలా సార్లు ఇంట్లో వంటగదిలోనే పూజగదిని కూడా ఏర్పాటు చేస్తారు. కానీ వాస్తు ప్రకారం వంటగదిలో కూడా ఈ పూజగది ఉండకూడదు. ఇలా చేయడంతో ధనలక్ష్మికి కోపం వస్తుంది.