Site icon HashtagU Telugu

Shanidev: శనీశ్వరుడికి తైలాభిషేకం చేస్తున్నారా.. అయితే ఈ తప్పులు అస్సలు చేయకండి?

Shanidev

Shanidev

మామూలుగా భక్తులు శనీశ్వరున్ని కూడా పూజిస్తూ ఉంటారు.. శనివారం రోజు శని దేవుడికి అంకితం చేయబడింది. కాబట్టి ఈరోజున స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మరికొందరు స్వామి వారిని పూజించడానికి కూడా భయపడుతూ ఉంటారు. ఇక అప్పుడప్పుడు చాలామంది శని దేవునికి ఇష్టమైన దుస్తులు ధరించడంతో పాటు స్వామి వారికి ఇష్టమైన పనులు చేస్తూ స్వామివారిని ప్రత్యేకంగా కొలుస్తూ ఉంటారు. అటువంటి వాటిలో స్వామివారికి తైలంతో అభిషేకం చేయడం కూడా ఒకటి.

అయితే శనీశ్వరుడికి తైలంతో అభిషేకం చేయడం మంచిదే కానీ కొన్ని తప్పులు తస్సలు చేయకూడదని చెబుతున్నారు పండితులు. మరి ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..శనికి తైలాభిషేకంచేసేటప్పుడు ఆయనకు ఎదురుగా ఉండి నూనెను పోయకూడదట. అదే విధంగా శనిదేవుడి విగ్రహం మీద వేసిన నూనెను అభిషేకం తర్వాత మంచి నీళ్లలో శుభ్రం చేయాలి. అలాగే చక్కెర, తేనె వంటి పదార్థాలను వేయకూడదు. దీని వల్ల విగ్రహానికి చీమలు పడుతాయట. అలాగే కేవలం శుభ్రమైన బట్టలు వేసిన దేవుడి దగ్గరకు వెళ్లాలట. మాసిపోయిన బట్టలు,రాత్రి వేసుకున్న బట్టలు మరల వేసుకుని శనిదేవుడి దగ్గరకు వెళ్లకూడదట. అలాగే లుంగీ వేసుకొని మాత్రమే పూజలు చేయాలని పండితులు చెబుతున్నారు.

శనిదేవుడికి నల్లటిబట్ట, నల్ల నువ్వులు, ఇనుము,ఉప్పు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా సాడేసాతి, ఏలినాటి శని వల్ల ఇబ్బందులు ఎదురైతే వీటిని దానంగా ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయట. అలాగే శనివారం రోజున కొత్తచెప్పులు, నల్ల బట్టలు, ఇనుము, ఉప్పు వంటికి ఇంటికి తీసుకురాకుదట. అలాగే ఈ రోజున ఎవరికి కూడా డబ్బులను ఇవ్వకూడదని చెబుతున్నారు పండితులు.