లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో పూజలు పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలోనే చాలామంది తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఇవి అనేక రకాల సమస్యలకు దారితీస్తాయట.. ముఖ్యంగా మనం ఎదుర్కొనే సమస్యలకు కారణం అవుతాయని చెబుతున్నారు. మరి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అన్న విషయానికి వస్తే.. స్త్రీలు మంగళవారం రోజు పుట్టింటి నుంచి అత్తారింటికి అస్సలు వెళ్ళకూడదట. అదేవిధంగా శుక్రవారం రోజు కోడల్ని పుట్టింటికి పంపించకూడదని చెబుతున్నారు.
లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకున్న వారు ఎల్లప్పుడూ గోళ్లను ఇంటి బయట కత్తిరించుకోవాలట. మధ్యాహ్న సమయంలో రాత్రి సమయాల్లో తులసి ఆకులను అసలు కోయకూడదని చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చడం, తల దువ్వుకోవడం చేయరాదట. అలాగే పెరుగు, ఉప్పు వంటివి సూర్యాస్తమయం తర్వాత ఎవరికి అప్పుగా ఇవ్వకూడదని చెబుతున్నారు. చాలా మంది హడావిడిగా గుమ్మం దాటి బయటకు వెళ్లేటప్పుడు గడప మీద పాదం పెట్టి వెళ్తుంటారు. కానీ అలా గడప మీద కాలు పెట్టి వెళ్లడం వల్ల లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట. అలాగే ఇంటి నుంచి ఎవరైనా బయటికి వెళ్తున్నప్పుడు కసువు ఊడ్వకూడదు.
అలాగే ఇల్లు ఊడిచేటప్పుడు చాలా మంది అది దాటుకుంటూ వెళ్లిపోతారు. అలా ఎప్పుడూ చేయకూడదట. మనకు బయటకు వెళ్తున్నామంటే ఇల్లు ఊడ్చేసి ఉండాలట. అప్పుడే బయటకు వెళ్లడం మంచిదని అంటున్నారు. అంతేకానీ ఊడవని ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదట. అలాగే ఇల్లు ఊడుస్తున్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదట. అదేవిధంగా చాలా మంది చేసే మరొక తప్పు ఏంటంటే మంచాల మీద పడుకున్నప్పుడు గోడకు పాదం పెట్టి మాట్లాడడం, నిద్రించడం చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మంచిది కాదని చెబుతున్నారు. రాత్రి సమయంలో బట్టలు వాష్ చేయడం లాంటివి అసలు చేయకూడదట.
అలాగే చాలామంది చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత విదిలిస్తూ ఉంటారు. ఇలా చేయకూడదని అది ఆశుభకరం అంటున్నారు. అలా జాడిస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందని చెబుతున్నారు. ఆడవారు ఒకరు ధరించిన వస్త్రాలు, ఆభరణాలు మరొకరు ధరించరాదట. ముఖ్యంగా ఫంక్షన్స్ టైమ్ లో ఒకరి నగలు మరొకరు ధరిస్తుంటారు. కానీ ఇలా ఒకరివి మరొకరు వేసుకోవడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుందట. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో చెప్పులు వేసుకొని తిరగకూడదట. తీవ్రమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇలా తిరిగితే పర్వాలేదని,కానీ మిగతా సందర్భాల్లో అలా అస్సలు తిరగకపోవడమె మంచిదని చెబుతున్నారు. శనివారం రోజు ఉప్పు నూనె వంటివి కొనుగోలు చేయకూడదట.