Site icon HashtagU Telugu

Saturday: తెలిసి తెలియక శనివారం రోజు ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే దరిద్రానికి ఆహ్వానం పలికినట్టే!

Saturday

Saturday

శనివారం రోజు నవగ్రహాల్లో అత్యంత ముఖ్యమైన గ్రహం శని గ్రహాన్ని పూజిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే శనీశ్వరుడికి శనివారం రోజు అంకితం చేయబడింది. ఈ రోజు నా శనీశ్వరుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం కలుగుతుందని కష్టాలు తొలగిపోయి శుక్ల శుభాలు కలుగుతాయని నమ్మకం. శనివారం రోజున తెలిసి తెలియక చేసే కొన్ని పనుల వల్ల కూడా కష్టాలను ఏరుకొని తెచ్చుకున్నట్టే అవుతుందని చెబుతున్నారు.. మరి శనివారం రోజు ఎలాంటి పొరపాటు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శనివారం నువ్వులు, నువ్వుల నూనెను కొనుగోలు చేయకూడదట. వస్తువులను నలుపు రంగులో ఉండే వస్తువులను నలుపు రంగు వస్త్రాలను ఉప్పు పత్తి వంటివి అసలు కొనుగోలు చేయకూడదని చెబుతున్నాడు.. కొత్త వాహనాలను కూడా శనివారం కొనుగోలు చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు. అలాగే శనివారం తలస్నానం చేయడం సర్వదా శ్రేష్టమని పెద్దలు చెబుతున్నారు. శనివారం రోజున తలస్నానం చేస్తే శని దేవుని అనుగ్రహంతో భోగభాగ్యాలను పొందుతారని చెబుతున్నారు.

అలాగే శనివారం రోజు పేదలను, వికలాంగులను, వృద్ధులను, దానం కోరి వచ్చిన వారిని చులకనగా చూడడం, పౌరుషంగా మాట్లాడడం, తక్కువ చేసి మాట్లాడడం లాంటివి అస్సలు చేయకూడదట. వీలయితే అలాంటి వారికి ధన సహాయం చేయడం మంచిదని చెబుతున్నారు. అంతేకాదు ఎవరితోనూ గొడవలకు, తగాదాలకు దిగకుండా ఉండడం కూడా మంచిదని చెబుతున్నారు. అలాగే శనివారం రోజు శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి ఆయనను భక్తిశ్రద్ధలతో పూజించడం ఆయనకు అభిషేకాలు చేయడం ఆయనకు ఇష్టమైన నల్ల నువ్వులను, నువ్వుల నూనెతో అభిషేకం చేయడం లాంటివి చేయాలట. ముఖ్యంగా శనివారం రోజున నల్ల కుక్కకు రొట్టె తినిపిస్తే మంచి జరుగుతుంది అని చెబుతున్నారు.