Site icon HashtagU Telugu

Spiritual: మీరు కూడా పూజ సమయంలో ఈ పొరపాట్లు చేస్తున్నారా.. అయితే కష్టాలు వెంటాడడం ఖాయం!

Spiritual

Spiritual

ఇంట్లో మనం నిత్య దీపారాధన చేస్తూ ఉంటాం. అయితే చాలా మంది పూజ చేసేటప్పుడు తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు. వాటి వల్ల పూజ చేసిన ఫలితం దక్కకపోగా లేనిపోని సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే పూజ ఫలితం దక్కాలి అంటే పూజ చేసేటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా శివలింగంలో విశ్వం శక్తి ఉంటుందని నమ్ముతారు. అందుకే పూజ సమయంలో కానీ ఇతర సమయాల్లో కానీ శివలింగాన్ని నేలపై ఖాళీగా ఉంచకూడదు అని చెబుతారు.

ఎల్లప్పుడు శివలింగాన్ని శుభ్రమైన ప్రదేశంలో మాత్రమే ఉంచాలని చెబుతున్నారు. చాలా మంది విగ్రహాలను శుభ్రం చేసే సమయంలో నేలపై ఉంచుతూ ఉంటారు. ఇలా విగ్రహాలను నేలపై ఉంచి శుభ్రం చేయకూడదట. అలాగే దేవుడి గదిని శుభ్రం చేసేటప్పుడు విగ్రహాలను నేలపై ఉంచకూడదని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల దేవుడిని అవమానించినట్లు అవుతుందట. ఇలా చేస్తే ఇంట్లోనే సుఖశాంతులు చెడిపోతాయని చెబుతున్నారు. అదేవిధంగా పూజా సమయంలో దీపం వేధించడం అన్నది శుభప్రదం. పూజా సమయంలో దీపాన్ని వెలిగించి నేలపై ఖాళీగా ఉంచకూడదట. ఆ దీపం కింద కొన్ని అక్షింతలు అయినా ఉంచాలని చెబుతున్నారు.

అలాగే హిందూ మతంలో శంఖానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. చాలా రకాల దేవాలయాల్లో శంఖాన్నీ ఊదుతూ ఉంటారు. ఇంట్లో శంఖం పెట్టుకోవడం మంచిదే కానీ, శంఖంలో నీరు ఎల్లప్పుడూ మారుస్తూ ఉండాలట. అలాగే ఏ ఇంట్లో అయితే పూజ సమయంలో ప్రతిరోజు శంఖం ఊదుతారో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని చెబుతున్నారు. అలాగే శంఖంని పూజ గదిలో పెట్టేటప్పుడు నేలపై అసలు పెట్టకూడదట. ఇలా చేస్తే ఆర్థిక నష్టం కలుగుతుందని చెబుతున్నారు. శాలిగ్రామాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు. శాలిగ్రామం విష్ణువుకు చిహ్నం. అందుకే విష్ణువు పూజలో శాలిగ్రామానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారు. ఏ ఇంట్లో అయితే శాలిగ్రామం ఉంటుందో అక్కడ సుఖసంతోషాలు వస్తాయట. కానీ దీనిని నేలపై ఉంచడం వల్ల నష్టం కలుగుతుందట. శాలిగ్రామాన్ని ఎప్పుడూ ఖాళీ నేలపై ఉంచకూడదని చెబుతున్నారు.