Site icon HashtagU Telugu

Spirituality: దేవుడు ఫోటోకి పెట్టిన పువ్వులు కింద పడితే దాని అర్థం ఏంటో తెలుసా?

Spirituality

Spirituality

మాములుగా దేవుళ్లకు పూజ చేసేటప్పుడు అనేక రకాల పూలను సమర్పిస్తూ ఉంటాం. దేవుళ్ళ ఫోటోలను విగ్రహాలను రకరకాల పువ్వులతో అలంకరిస్తూ ఉంటాం. అయితే మనం ఆలయంలో గాని లేదంటే ఇంట్లోనే పూజ మందిరంలో కానీ దేవుడి ఫోటో లేదా విగ్రహానికి పెట్టినా పువ్వులు మనం కింద పడటం చూసే ఉంటాం.. దేవుడి దయ కలగాలని ప్రతిరోజు పూజలు కూడా చేస్తూ ఉంటారు. దీపాన్ని వెలిగించి హారతి కూడా ఇస్తూ ఉంటారు. అలాగే దేవుడి దగ్గర పువ్వులు పెట్టి కొబ్బరి కాయలు కొడతారు. అయితే చాలా సార్లు దేవుడి చిత్రపటం ముందు పెట్టిన పువ్వులు కింద పడుతుంటాయి.

మతపరంగా ఇలాంటి సంకేతాలను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అయితే పూజ సమయంలో దేవుడి ఫోటో ముందు ఉన్న పువ్వు అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై పడినప్పుడు, దేవుని చిత్రం లేదా విగ్రహం నుంచి ఒక పువ్వు కింద పడినప్పుడు అది మీకు ప్రత్యేక సంకేతం కావచ్చు అంటున్నారు పండితులు. విగ్రహం ముందు ఉన్న పువ్వులు అకస్మత్తుగా మీద పడటం మీ పూజ విజయవంతమైందని అర్ధమట. అంటే దేవుడు మీతో సంతోషంగా ఉన్నాడని అర్థం వస్తుందట. అలాగే మీ కోరికలు కూడా త్వరలోనే నెరవేరబోతున్నాయనడానికి సంకేతం అంటున్నారు. అలాగే దానిని మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సుకు సంకేతంగా భావించాలని పండితులు చెబుతున్నారు.

అందుకే దేవుడి ఫోటో నుంచి పడే ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించాలని పండితులు చెబుతున్నారు. అయితే పూజ చేసేటప్పుడు విగ్రహం లేదా చిత్ర పటాల నుంచి పడిన పువ్వును మీతో ఉంచుకోవాలి. ఈ పువ్వును శుభ్రమైన ఎరుపు వస్త్రంలో 1 రూపాయి నాణెం, కొంత బియ్యంతో కట్టాలి. దీన్ని డబ్బున్న ప్రదేశంలో పెట్టాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎప్పటికీ డబ్బుకు కొరత ఉండదట.

Exit mobile version