Site icon HashtagU Telugu

Trees: కలలో మీకు ఈ చెట్లు కనిపించాయా.. అయితే అదృష్టం,ధనలాభం?

Mixcollage 03 Feb 2024 01 06 Pm 1093

Mixcollage 03 Feb 2024 01 06 Pm 1093

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు అనేక రకాల కలలు రావడం అన్నది సహజం. అయితే అందులో కొన్ని రకాల కలలు మాత్రమే మనకు గుర్తుంటాయి. అందులో కొన్ని పీడకలలు కావచ్చు లేదంటే మంచి కలలు కూడా కావచ్చు. అయితే స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తుని సూచిస్తాయని చెబుతుంటారు. చాలా వరకు కలలో జరిగేవి నిజమవుతాయని కూడా చెబుతూ ఉంటారు. మామూలుగా మనకు కలలో కూడా అనేక రకాల చెట్లు కనిపించడం అన్నది సహజం. అయితే మరి కలలో ఎలాంటి చెట్లు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు కనిపిస్తే కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మాములుగా చాలా కలలు భవిష్యత్తులో జరిగే పరిణామాలను సూచిస్తాయి అని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. చాలామందికి కలలో చెట్లు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం రాత్రి నిద్రిస్తున్నప్పుడు చెట్లను గురించి కలలు కనడం మన జీవితంలో భవిష్యత్తులో జరగబోయే అనేక సంఘటనలను సూచిస్తాయి. అయితే కలలో కొన్ని చెట్లు మనకు ఆశుభాలని తీసుకువస్తాయి. కొన్ని చెట్లు వస్తే అవి అదృష్టాన్ని తీసుకు వస్తాయని, ధన లాభాన్ని కలిగిస్తాయట. కలలో వెదురు చెట్టు కనిపించడం చాలా శుభప్రదంగా చెప్పవచ్చు. ఈ చెట్టు కలలో కనిపిస్తే కుటుంబ పరిస్థితులు చాలా సంతోషంగా ఉంటాయి. ఇంట్లో చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి.

కలలో రావి చెట్టు కనిపిస్తే జీవితాంతం శుభప్రదంగా ఉంటుందని, అదృష్టం కలిసి వస్తుందని అర్థం. కలలో తులసి మొక్క కనిపిస్తే ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని లక్ష్మీదేవి కృప వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. కలలో మామిడి చెట్టును చూడటం శుభప్రదం. ఇది ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తుంది. కలలో అపరాజిత చెట్లను, శంఖు పూలను చూస్తే కొన్ని శుభవార్తలు వింటారని, కుటుంబంలో గొడవలు కూడా సమసిపోతాయని చెబుతున్నారు. కలలో మనీ ప్లాంట్ వస్తే ఇంటికి చాలా డబ్బు వస్తుంది అన్న సంకేతం. కలలో మారేడు దళాలు కానీ మారేడు చెట్టు కానీ వస్తే పరమశివుడి అనుగ్రహం ఉంటుందని చెబుతున్నారు. కలలో అరటి చెట్టు వస్తే త్వరలో కొన్ని శుభవార్తలు వింటారు అని చెబుతున్నారు. ఇలా స్వప్నంలో మనకు వచ్చే వివిధ శుభప్రదమైన చెట్లు మనకు అదృష్టాన్ని ఇస్తాయని, ధన లాభాన్ని కలుగజేస్తాయని చెబుతున్నారు.