Today Horoscope : మేష రాశి నుంచి మీన రాశి వరకు ఈరోజు రాశి ఫలితాలు ఇవీ..
మేష రాశి
ఈరోజు మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అనుకున్న పనులు పూర్తి అవుతాయి. మీరు చేసే పనులకు ఇతరుల సహకారాలు అందుతాయి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసం దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. శుభఫలితాల కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
వృషభ రాశి
వృషభ రాశి వారు ఖర్చులు నియంత్రించుకోవాలి. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం పొందుతారు. ఆర్థిక స్ధితి కొంత మెరుగుపడుతుంది. కీలక విషయాల్లో తోటివారి సలహాలు తప్పనిసరి. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
మిథునం
మిథునరాశిలోని భార్యాభర్తల మధ్య అనుబంధం ఈరోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులకు మీపై ప్రేమ పెరుగుతుంది. స్త్రీ సౌఖ్యము కలుగును. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రామనామ జపం శ్రేయోదాయకం. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. లింగాష్టకాన్ని పఠించండి.
కర్కాటకం
కర్కాటక రాశిలోని వ్యాపారస్తులకు ఒత్తిళ్ళు అధికముగా ఉన్నాయి. అనుకున్న పనులు వాయిదా వేస్తారు. భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే సూచన ఉంది. ఆరోగ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. చంచల నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మాట విలువను కాపాడుకోవాలి. అనవసర కలహాలతో సమయాన్ని వృథా కానీయకండి. నవగ్రహ ఆలయాలలో శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణం చేయడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి.
సింహం
సింహరాశి వారు అనవసర ఖర్చులు నియంత్రించుకోవాలి. శుభవార్తలు వింటారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. హనుమత్ ఆరాధన శుభప్రదం. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
Also read : Anjeer : అంజీర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. తినకుండా అస్సలు ఉండలేరు?
కన్య(Today Horoscope)
కన్యారాశి వారికి ఈ రోజు ఆరోగ్యము అనుకూలిస్తుంది. ధనసహాయం ఏదోరకంగా అందుతుంది. స్త్రీ సౌఖ్యం కలదు. భార్యాభర్తల మధ్య దాంపత్య సౌఖ్యం కలుగును. సంతోషకరమైన వార్తలు వింటారు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం. నవగ్రహ ఆలయాలను దర్శించండి. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
తుల
తులారాశిలోని ఉద్యోగులు ఉన్నత అధికారుల మన్నన పొందుతారు. రాజకీయ నాయకులకు ఈరోజు కలసి వస్తుంది. కుటుంబ సభ్యుల వలన ధనలాభము కలుగును. స్త్రీ సౌఖ్యం కలుగును. శారీరక శ్రమ అధికముగా ఉంటుంది. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయములు కలుగును. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. లింగాష్టకాన్ని పఠించండి.
వృశ్చికం
వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. స్త్రీ మూలకంగా ధనలాభము జరుగుతుంది. శుభవార్తలు వింటారు. పిల్లలతో విలువైన సమయాన్ని గడపడం వల్ల ఒత్తిళ్ళు తొలగుతాయి. వ్యాపారస్తులకు లాభదాయకముగా ఉంటుంది. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
ధనుస్సు
ధనుస్సు రాశి వారికి ఈరోజు దాంపత్య సౌఖ్యం కలుగును. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడును. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. ముఖ్య పనులను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడమే మంచిది. కొన్ని సంఘటనలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగంలో ఆచితూచి వ్యవహరించాలి. వేంకటేశ్వరస్వామిని పూజించడం, వేంకటేశ్వరస్వామి సుప్రభాతం వినడం, చదవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
Also read : Slackline Athlete Rope Walk : రెండు ఎత్తయిన టవర్ల మధ్య కట్టిన తాడుపై నడుస్తూ రికార్డు..
మకరం
మకర రాశి వారు నూతన కార్యాలు ప్రారంభించడంలో ఆలస్యమవుతుంది. అధిక బరువును అదుపులో పెట్టుకునేందుకు ఆహార, వ్యాయామాల్లో మార్పులు చేసుకోవాలి. అనవసర సందేహాలు, అనుమానాలు, ఆలోచనలు మానసిక అనారోగ్యానికి దారితీస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. నవగ్రహ ఆలయ ప్రదక్షిణం చేయడం మంచిది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
కుంభం
కుంభ రాశి వారు ఈ రోజు నిరాశ, నిస్పృహలను వీడుతారు. కీడు చేసే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో కటువుగా మాట్లాడొద్దు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. అధికారులతో జాగ్రత్త. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి. శివాలయాన్ని దర్శించండి. శని జపం అనుకూలతను ఇస్తుంది.
మీనం
మీన రాశి వారు ఈ రోజు అనవసర ఖర్చులు తగ్గించుకుంటే మంచిది. ప్రతీ పనిలో అతిగా ఆలోచించడం, అతిగా మాట్లాడటం మంచిది కాదు. జీవిత భాగస్వామితో సఖ్యత కోరుకుంటారు. రాజకీయ నాయకులకు చెడు సమయం. సమస్యలు తొలగి కుదురుకుంటారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి.
గమనిక: ఈ కథనంలో ఉన్న సమాచారం వివిధ మాధ్యమాలు/ జ్యోతిష్యులు/ పంచాంగాలు/ ఉపన్యాసాలు/నమ్మకాలు/గ్రంధాల నుండి సేకరించిన తర్వాత మీ ముందుకు తీసుకురాబడింది. మా లక్ష్యం సమాచారాన్ని అందించడం మాత్రమే, దాని వినియోగదారులు దానిని కేవలం సమాచారంగా తీసుకోవాలి. అదనంగా, దాని యొక్క ఏదైనా ఉపయోగం వినియోగదారు యొక్క పూర్తి బాధ్యత.