Site icon HashtagU Telugu

Lord Shiva: పరమేశ్వరుడిని ఎప్పుడు పూజిస్తే మంచి జరుగుతుందో పుణ్యం లభిస్తుందో మీకు తెలుసా?

Lord Shiva Favourite Colour

Lord Shiva Favourite Colour

హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే దేవుళ్ళలో పరమేశ్వరుడు కూడా ఒకరు. సోమవారం రోజు శివుడికి అంకితం చేయబడింది. అందుకే సోమవారం రోజు పరమేశ్వరుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అలాగే కార్తీకమాసం, మాఘమాసం,శివరాత్రి, మాస శివరాత్రి ఇలా ఎన్నో ప్రత్యేకమైన రోజుల్లో శివుడిని ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. వీటితోపాటు కొన్ని ప్రత్యేక సమయాల్లో సందర్భాల్లో పూజించడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట. శివుడిని పూజించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు, సమయాల్లో పూజిస్తే పుణ్యఫలం లభిస్తుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రదోష కాలంలో పూజించడం మంచిదని చెబుతున్నారు. సాయంత్రం 4:30 నుండి 6:00 గంటల మధ్య సమయం ప్రదోష కాలం. ఈ సమయంలో శివుడిని పూజించడం అత్యంత పుణ్య ఫలాన్ని ఇస్తుందట. ఎందుకంటే ఇది శివుడు నందిపై కూర్చుని లోకానికి శుభాన్ని ప్రసాదించే సమయం. కాబట్టి ఈ సమయంలో పూజించడం వల్ల ఆయన అనుగ్రహం తొందరగా కలుగుతుందట. మాఘ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి రోజున మహా శివరాత్రి వస్తుంది. ఈ రోజు శివుడిని పూజించడం విశేష ఫలితాలను ఇస్తుందట. ఈ రోజున ఉపవాసం, జాగరణ చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

సోమవారం శివుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందట. శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో శివుడిని పూజించడం వల్ల విశేష అనుగ్రహం లభిస్తుందట. ప్రతి మాసంలో వచ్చే కృష్ణ పక్ష చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ఈ రోజున శివుడిని పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందట. ఈ సమయాల్లో శివుడిని పూజించడం వల్ల మనోభీష్టాలు నెరవేరుతాయట. పాపాలు కూడా తొలగిపోతాయట. పుణ్యం లభిస్తుందట. మోక్షం ప్రాప్తిస్తుందని చెబుతున్నారు. అయితే శివుడిని పూజించడానికి ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. శివుడికి అభిషేకం చేయాలి. అభిషేకం అంటే శివుడికి నీరు, పాలు, పెరుగు, తేనె మొదలైన వాటితో స్నానం అభిషేకం చేయాలి. శివుడికి బిల్వ పత్రాలు సమర్పించాలి. బిల్వ పత్రాలు శివుడికి చాలా ప్రీతికరమైనవి. శివుడికి ధూపం, దీపం వెలిగించాలి. శివుడికి నైవేద్యం సమర్పించాలి. శివుడి మంత్రాలను జపించాలట. శివుడి కథలను చదవాలట.

Exit mobile version