Site icon HashtagU Telugu

Shani Effect: శని ప్రభావంతో బాధపడున్నారా.. అయితే కొత్త ఏడాదిలో ఈ 5 వస్తువులు మీ దగ్గర ఉండాల్సిందే?

Mixcollage 28 Dec 2023 08 42 Pm 1828

Mixcollage 28 Dec 2023 08 42 Pm 1828

మరొక మూడు రోజుల్లో 2024 కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే ఈ ఏడాది అనగా 2023 లో మీరు శని దేవుడి వల్ల ఇబ్బంది పడి ఉంటే రాబోయే సంవత్సరంలో శని దేవునికి సంబంధించిన ఐదు రకాల వస్తువులు ఉపయోగించడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఆయన అనుగ్రహం మీకు కలుగుతుంది. ప్రస్తుతం శనిగ్రహం మకరం, కుంభం, మీన రాశులలో ఉంది. 2024లో శని రాశిలో మార్పు ఉండదు. అవును ఏ రాశిలోనైనా శని మహాదశ రావచ్చు. శనిదేవుడు మీ దగ్గర ఉంచుకొని వాడితే త్వరలో శుభ ఫలితాలు ఇస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని విషయాలు ప్రస్తావించబడ్డాయి. 2024లో శనిదేవుని ఆశీస్సులు పొందాలంటే ఈ ఐదు విషయాలను తెలుసుకొని కొత్త సంవత్సరం ప్రారంభం కాకముందే మీ ఇంటికి తీసుకురావాలట. ఇంతకీ ఆ ఐదు రకాల వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఏడు ముఖి రుద్రాక్ష.. ఏడు ముఖి రుద్రాక్షలు ధరించిన వ్యక్తులు శనిదేవుని ఆగ్రహానికి గురికావాల్సిన అవసరం లేదట. ఈ రుద్రాక్ష మహాలక్ష్మి స్వరూపం మాత్రమే కాదండోయ్, దీనితో పాటు దీనిని ధరించేవారు లేదా తమ ఇంటిలోని గుడిలో ఉంచుకునేవారు రోజూ పూజిస్తే శనిదేవుడు వారికి సంపద, శ్రేయస్సును అనుగ్రహిస్తాడు.

నీలమణి.. శని దేవుడికి అత్యంత ఇష్టమైన రత్నం నీలం. నీలమణి అత్యంత వేగంగా ఇచ్చే రత్నంగా చెప్పబడింది. మీరు నీలం రత్నాన్ని ధరించాలనుకుంటే, అర్హత కలిగిన జ్యోతిష్కులను సంప్రదించిన తర్వాత మాత్రమే ధరించాలి. మీరు రత్నాన్ని ధరించకూడదనుకుంటే, దానిని ఆలయంలో ఉంచి ప్రతిరోజూ పూజించడం మంచిది.

ఇనుప ఉంగరం.. అలాగే మధ్య వేలుకు ఇనుప ఉంగరాన్ని ధరించడం వల్ల శని దేవుడికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవట. దీనిని ధరించడం వల్ల శనిగ్రహ బాధ నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు ఇనుప ఉంగరం ధరించాలనుకుంటే, శనివారం ధరించడం మంచిది. మీరు కొత్త సంవత్సరంలో ఇనుప ఉంగరాన్ని ధరించాలనుకుంటే, జనవరి 7న ధరించవచ్చు.

అదేవిధంగా శనిదోషాలు తొలగేందుకు శమీ వృక్షాన్ని నాటినప్పటికీ కొన్ని కారణాల వల్ల మీ ఇంట్లో శమీ వృక్షాన్ని నాటడం కుదరకపోతే శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే అందుకు చిన్న పరిష్కారం దొరుకుతుందట. ఇలా కూడా చేయడం వల్ల శమీ చెట్లను నాటడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.