Site icon HashtagU Telugu

Shani: శనిదేవుని దుష్ప్రభావం మీపై ఉండకూడదంటే శనివారం రోజు ఈ ఆహారం తినాల్సిందే?

Mixcollage 20 Feb 2024 09 25 Pm 8071

Mixcollage 20 Feb 2024 09 25 Pm 8071

సాధారణంగా చాలామంది శనీశ్వరుని పేరు వెంటనే చాలా భయపడిపోతూ ఉంటారు. శనీశ్వరుని పూజించాలి అన్న ఆయన ఆలయానికి వెళ్లాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే శనీశ్వరుడి అనుగ్రహం ఒకసారి కలిగింది అంటే చాలు. ఎంతటి బీదవారైనా సరే కోటీశ్వరులు అవ్వాల్సిందే. అలాగే ఎవరి జాతకంలో అయితే శని ఉంటుందో వారి జాతకంలో మంచి, చెడులు రెండు ఉంటాయి. జాతకంలో శని ఉన్నంత మాత్రాన మొత్తం చెడు జరుగుతుంది అని కాదు. అలా అని అంతా మంచే ఉంటుంది అని కూడా కాదు. శని సహనాన్ని ఇచ్చే దేవుడు. శని క్రమశిక్షణకు మారుపేరు. ఎవరి రాశిలో అయితే శని దేవుడు మంచి స్థానంలో ఉంటాడో వారు అదృష్టవంతులు.

వారి జీవితం సంతోషంగా, ప్రశాంతంగా సాగుతుంది. ఎవరి రాశులలో అయితే శని చెడు స్థానంలో ఉంటాడో వారు అనేక కష్టనష్టాలను చవిచూడాల్సి వస్తుంది. తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రతికూల ప్రభావాలను చూపించే శని దేవుని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని పనులు చేస్తే మంచిది. శని దేవుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు నల్లటి వస్త్రాలను ధరించి, నువ్వుల నూనెతో శని దేవుడికి అభిషేకం చేయాలి. నల్లటి వస్త్రాన్ని శని దేవుడికి ఉత్తరీయంగా వేసి అత్యంత భక్తితో ఆయనను పూజించాలి. శని దేవుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు స్వామి అనుగ్రహం కోసం కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి.

చాలామంది తెలిసి తెలియక శనివారం నాడు శనికి నచ్చని ఆహార పదార్థాలను తింటూ ఉంటారు. అయితే అది మంచిది కాదు. శని అనుగ్రహం పొందాలి అనుకునేవారు ఆరోజు పప్పులను తినడం మంచిది. శనివారం నాడు పొరపాటున కూడా ఎండుమిరపకాయలను తినకూడదు. వాటిని వంటలో ఉపయోగించకూడదు. అలా చేస్తే శని దేవుడికి కోపం వస్తుంది. ఇక శనివారం నాడు పొరపాటున కూడా కాల్చిన వంకాయలతో చేసిన కూరను తినకూడదు. గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను తినకూడదు. ఆవనూనెతో చేసిన పదార్థాలను కూడా శనివారం నాడు తినకూడదు. ఇక ఈ పదార్థాలను తింటే శని దేవుడికి కోపం వస్తుంది. కాబట్టి వీటిని తినకుండా ఉండడం మంచిది. ఇక శనివారం నాడు మిరియాలు తింటే మంచిదని, పెసరపప్పు తింటే మంచిదని, పన్నీరు తింటే మంచిదని, సొరకాయలు, బీరకాయలు వంటి తినడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. అయితే జ్యేష్ఠ, భద్రపద మాసాలలో శనివారాలలో సొరకాయలు బీరకాయలు వంటి వాటిని తినకూడదు..

Exit mobile version