Site icon HashtagU Telugu

Navagraha: నవగ్రహాలకు ఇష్టంలేని ఈ పనులు పొరపాటున కూడా చేయొద్దు.. చేశారో అంతే సంగతులు!

Mixcollage 09 Feb 2024 07 15 Pm 4424

Mixcollage 09 Feb 2024 07 15 Pm 4424

మామూలుగా మనం జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే మనపై గ్రహాల అనుకూలత కచ్చితంగా ఉండాల్సిందే. నవగ్రహాలు మనపై సానుకూలంగా అనుకూలిస్తేనే మన జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా సాగిపోతుంది. ఒకవేళ నవగ్రహాలు అనుకూలించకపోయినప్పటికీ నవగ్రహాలకు కోపం తెప్పించే పనులు ఇష్టం లేని పనులు అస్సలు చేయకూడదు. అలా చేశారంటే జీవితంలో ప్రతికూల ప్రభావం కచ్చితంగా కనిపిస్తుంది. మరి నవగ్రహాలకు ఇష్టం లేని ఆ పనులు ఏవి? ఒకవేళ అలాంటి పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గురువైన బృహస్పతికి కోపం రాకుండా ఉండాలంటే గురువులను గౌరవించాలి. ఎవరైనా గురువుని కించపరిస్తే బృహస్పతికి కోపం వస్తుంది. ఇక బుధుడికి ఎవరైనా వ్యాపారాన్ని అశ్రద్ధ చేసినా, తనకే ఎక్కువ జ్ఞానం ఉందని విర్రవీగినా కోపం వస్తుందట. అంతేకాదు చెవిలో వేలు పెట్టుకుంటే బుధుడికి విపరీతమైన కోపం వస్తుందట. కాబట్టి బుధవారం రోజున పొరపాటున కూడా ఆ పని అస్సలు చేయకూడదు. ఇక చంద్రుడు మన జీవితంలో మంచి ఫలితాలను ఇవ్వాలంటే ఆయనకు కోపం రాకుండా చూసుకోవాలి. అద్దంలో దిగంబరంగా చూసుకోవడం, వెక్కిరించడం వంటివి చేస్తే చంద్రుడికి విపరీతమైన కోపం వస్తుంది. శని దేవుడికి మరుగుదొడ్లు శుభ్రంగా లేకపోయినా, పెద్దవారిని కించపరిచినా, తల్లి తండ్రిని చులకనగా చూసినా కోపం వస్తుందని చెబుతారు. శని దేవుడు ఎవరికైనా సేవ చేసేవారికి అనుకూల ఫలితాలను ఇస్తారని చెబుతారు.

ఎవరైనా పితృదేవతలను దూషిస్తే సూర్య దేవుడికి కోపం వస్తుందని అంతే కాదు సూర్య దేవునికి ఎదురుగా మలమూత్ర విసర్జన చేసినా, దంతధావనం చేసిన కోపం వస్తుందని చెబుతారు. అప్పు ఎగ్గొడితే కుజగ్రహానికి కోపం వస్తుందది. వ్యవసాయ పరంగానూ మోసం చేస్తే కుజుడు సహించడు. ఇక శుక్రగ్రహానికి భార్య, భర్త ఒకరినొకరు అగౌరవపరుచుకుంటే కోపం వస్తుంది. లక్ష్మీదేవి కృప లేకపోతే శుక్రుడు కృప కూడా ఉండదు. ఇక లక్ష్మీదేవి భర్తలేని ఇంట్లో నివసించలేదని, గొడవలు పడే ఇంట్లో ఉండదు. కేతువుకి పెద్దలు మరణించిన తర్వాత చేయాల్సిన క్రతువులు చేయకపోతే విపరీతమైన కోపం వస్తుంది. మన జాతకంలో కేతువు మంచి స్థానంలో లేకపోతే, లేక ఆయనకు కోపం వస్తే పిశాచి పీడ కలుగుతుంది. వైద్యవృత్తి పేరుతో మోసం చేసినా, పాములకు ఏమైనా హాని చేసినా రాహువుకు కోపం వస్తుంది. నవగ్రహాలకు కోపం వచ్చే పనులు చేయకుండా, నవగ్రహాలు ప్రసన్నమయ్యే పనులు చేస్తే జీవితం ప్రశాంతంగా సాగుతుంది.