Astrology : ఎంత కష్టపడినా విజయం వరించడం లేదా…ఈ పరిహారాలు ఓసారి పాటించి చూడండి..!!

న్యాయంగా సంపాదించిన సొమ్ముతో చేసే ఏ కార్యమైనా సరే సత్పలితాలను ఇస్తాయి. మన చేతులతో ఎంత దానం చేస్తామో...అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతాయు.

  • Written By:
  • Updated On - June 25, 2022 / 10:13 AM IST

న్యాయంగా సంపాదించిన సొమ్ముతో చేసే ఏ కార్యమైనా సరే సత్పలితాలను ఇస్తాయి. మన చేతులతో ఎంత దానం చేస్తామో…అంతకు రెట్టింపు ఫలితాన్ని పొందుతాయు. కొన్ని సార్లు ఎంత కష్టపడినా..ఫలితం మాత్రం రాదు. వైరాగ్యం వల్ల ఏ పనిపై కూడా మనస్సు పెట్టలేకపోతాము. మనం సంపాధించిన సొమ్ములో ఓ పదిశాతం డబ్బును దానధర్మాలకు సత్కార్యాలకు కొరకు ఖర్చు చేయాలి. పేదవారికి, అవిటివారికి, నిర్భాగ్యులకు, చిన్నపిల్లలకు, వితంతువులకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నవారికి ఎంతో కొంత సాయం చేయాలి. ఆ పుణ్యఫలితం మీ కుటుంబాన్ని మిమ్మల్ని శుభాన్ని కలుగజేస్తుంది.

ఎందుకంటే జీవితంలో సానులకూలతను పెంపొందించుకోవడానికి కచ్చితంగా సహాయపడతాయి. జీవితం అనేది సుఖ-దు:ఖాల సమాహారం. ప్రతిఒక్కరి జీవితంలో నిరాశ అలముకుని ఉంటుంది. అప్పుడు ఏ పనిలోనూ మనస్సును లగ్నం చేయలేకపోతాం. ఎంత కష్టపడినా విజయం సాధించలేకపోతాం. రాత్రి, పగలు తీవ్రంగా శ్రమించినా ఫలితం ఉండదు. చేపట్టిన పనులు ప్రారంభించిన వ్యవహారాల్లో వైఫల్యం ఎదురవుతుంటే..కొన్ని నివారణలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఇవి మీ జీవితంలో సానుకూలత పొందేందుకు తప్పనిసరిగా సహాయపడతాయి. జీవితంలో నిరాశ, నిస్ప్రుహలు ఎదురైనప్పుడు ఆచరించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం.

రావిచెట్టుకు ప్రదక్షిణ:
గ్రహస్థితి బాగలేనప్పుడు ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటే..ప్రతిరోజూ రావిచెట్టు దగ్గర నువ్వులు లేదా ఆవాల నూనేతో దీపారాధన చేయాలి. కొంత పంచదారను చెట్టు వేర్లలో పోసి నిధానంగా 11సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ అని స్మరించుకుంటూ ప్రదక్షిణలు చస్తే కష్టాల నుంచి గట్టేక్కుతారు.

గోమాత సేవ:
సమస్తదోషాలను నివారించే తల్లి గోమాత. మీకు వీలైనన్ని సార్లు గోవుకు తోచినంత గ్రాసం పెట్టి మూడుసార్లు ప్రదక్షిణలు చేయండి. అద్భుతమైన ఫలితాలను పొందుతారు.

విఘ్నేశ్వరుని నామం స్మరించండి:
ఇంట్లో నుంచి శుభకార్యాలకు వెళ్తుంటే ఈ పరిహారాన్ని ప్రయత్నించండి. మీరు చేయాల్సిందల్లా ఇంట్లో నుంచి బయలుదేరే ముందు శ్రీ గణేశాయ అనే మంత్రాన్ని జపించండి. వ్యతిరేక దిశలో నాలుగు అడుగులు వెనకాలకు వేసి ఆ పైన గణపతి దగ్గర ప్రసాదంగా పెట్టిన బెల్లం ముక్కను నోట్లో వేసుకోండి. అప్పుడు మీరు వెళ్లాల్సిన పనిపై వెళ్లండి. ఈ పరిహారం పాటిస్తే మీరు వెళ్లినచోట విజయం లభిస్తుంది.

మీరు చేపట్టిన విజయం సాధించలేనట్లయితే…ప్రతి ఆదివారం నాడు రెండు చేతులు పైకి ఎత్తి సూర్యుడికి నీటితో ఆర్ఝ్యం సమర్పించిన తర్వాత నమస్కారం చేయండి. ఆదివారం రోజు ముందు మాంసం తీసుకోవద్దు. రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల మీకు ప్రయోజనం చేకూరుతుంది. ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుంది.

నలుపు రంగు దారాన్ని మీ వయస్సుకు సమానమైన ముడులను దానిపై కట్టండి. అరటి, తులసి ఆకుల రసాన్ని ప్రతి ముడిపై వేయండి. పసుపు, సింధూరాన్ని దారానికి రుద్దండి. ఆ దారాన్ని కుడిచేతికి కిందికి ఉండేట్లు ధరించండి. ఈ విధంగా 21 రోజులపాటు ఆ ధారాన్ని ధరించాలి. ఇలా చేస్తే..మీ జీవితంలో నిరాశ తొలగిపోతుంది. అనుకున్న విజయాన్ని సాధిస్తారు.

ఆకలితో ఉన్నవారి ఆకలిని తీర్చండి. నోరువిడిచి మిమ్మల్ని ఎవరైనా యాచిస్తే కాదనకుండా లేదనకుండా ఎంతో కొంత దానం చేయండి. యాచించిన వారిని రిక్త హస్తాలతో పంపవద్దు. బాటసారులకు కానీ ఇంటికి ఎవరైనా వస్తే వారు అడగకపోయినా సరే తాగేందుకు మంచినీళ్లు ఇవ్వండి.

శాస్త్రాల్లో గాయత్రి మంత్రం, మహామృత్యుంజయమంత్రాలు విజయాక్షరాలుగా పరిగణిస్తుంటారు. రోజు ఈ మంత్రాలను కనీసం 108 సార్లు జపింస్తే అంతా మంచి జరుగుతుంది. ఇలా చేస్తే గాయత్రి మాత, పరమేశ్వరుని ఆశీర్వాదం పొందుతారు.

ఏదైనా అత్యవసర పనిమీద ఇంటి నుంచి బయటకు వెళ్లేముందు గోధుమపిండిలో కొంచెం బెల్లం కలిపి నువ్వుల నూనె వేసి తయారు చేసిన రొట్టెను మీతోపాటు తీసుకువెళ్లండి. మార్గం మధ్యలో కాకులకు రొట్టెను చిన్న చిన్న ముక్కలుగా వేసి వాటికి తినిపించండి. ఇలా చేస్తే చేపట్టిన పనులు, ప్రారంభించిన వ్యవహారాలు అనుకూల సమాయానికి పూర్తి అవుతాయి. విజయం సాధిస్తారు.