Snakes: పాములు ఇలా కనిపిస్తే చాలు.. అదృష్టం పట్టి పీడించడం ఖాయం?

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 01:49 PM IST

వాస్తు శాస్త్రంలో పిల్లలు కుక్కలు కాకులు ఇలా మొదలైన జీవులు ఎదురుపడినప్పుడు లేదంటే కలలో కనిపించినప్పుడు అనేక రకాల ఫలితాలు కలుగుతాయని తెలిపారు. బయటికి వెళ్తున్నప్పుడు ఎదుర్కొన్నప్పుడు ఒక విధమైన ఫలితం అలాగే కలలో కనిపించడం ఒక విధమైన ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతూ ఉంటారు. పాములను చూస్తే కూడా శుభ అశుభ శకునాలు ఉన్నాయని, పాములను ఏ సమయంలో చూడవచ్చు? ఏ సమయంలో చూడకూడదు వంటి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పాములు పక్కగా వెళ్తే సంకేతాలు ఇవే సాధారణంగా మనం బయటకు వెళ్ళినప్పుడు, లేదా ఏదైనా పొలాలకు వెళ్ళినప్పుడు అనేక సందర్భాలలో పాములను చూస్తూ ఉంటాం.

ఒక్కొక్కసారి మన పక్కనుండే పాములు వెళ్లే సందర్భాలు కూడా ఉంటాయి. అయితే పాములు ఏ విధంగా కనిపిస్తే మనకు కలిసొస్తుంది? ఎలా కనిపిస్తే మనకు నష్టం జరుగుతుంది? వంటి అంశాలను పరిశీలించినట్లయితే మనం ఎక్కడికైనా బయటకు వెళుతున్నప్పుడు పాములు మన పక్కనుండి కుడివైపుగా వెళితే మనకు మంచి జరుగుతుంది. ఏ పని మీద అయితే మనం బయలుదేరి వెళ్తామో ఆ పని కచ్చితంగా పూర్తి అవుతుంది. అది మనకు అదృష్టాన్ని తీసుకొస్తుంది. పాములు మన పక్కగా కుడివైపున వెళ్లినప్పుడు ఊహించని లాభాలు చోటు చేసుకుంటాయి. పాములు చెట్టుపైకి పాకుతున్నట్టు కనిపిస్తే కలిగే ఫలితాలు ఇవే ఎక్కడైనా పాము ఏదైనా చెట్టు పైకి కానీ, గోడ పైకి కానీ ఎక్కుతున్నట్టుగా కనిపిస్తే అది కూడా మనకు శుభశకునం గానే భావించాలి.

పాము చెట్టు పైకి కానీ గోడ పైకి కానీ ఎక్కడం మన ఎదుగుదలను సూచిస్తుంది. మనం కూడా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామని సంకేతాన్ని ఇది ఇస్తుంది. ఇక అంతే కాదు చెట్టుపై నుంచి కిందికి పాము దిగుతున్నట్లుగా మనకు కనిపిస్తే అది కూడా శుభ ఫలితాలను ఇస్తుందని చెబుతున్నారు. ఊహించని అకస్మాత్తు ధన లాభం మనకు కలుగుతుంది. పాముల విషయంలో రెండిటిని మనం చూస్తే అశుభ శకనంగా భావించాలి. ఒకటి చనిపోయిన పామును చూస్తే అది అశుభసంకేతమని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఎవరైనా చనిపోయిన పామును చూస్తే, ఆ తరువాత శివాలయానికి వెళ్లి ఆ శివుడికి పూజలు, అర్చనలు చేయడం మంచిది.

అలా శివుడిని దర్శించుకునీ పూజలు చేయడం వల్ల చనిపోయిన పాముని చూసిన దోషాలు తొలగిపోతాయట. అలవాటు పాముల విషయంలో మనం చూడకూడని రెండవది. జంటగా కలిసి ఉన్న పాములను పొరపాటున కూడా చూడకూడదు. ఒకవేళ అలా ఏవైనా పాములు తారస పడితే వాటికి దూరంగా వెళ్లిపోవాలి. మనం వాటిని చూడడం వల్ల పాముల మధ్య ప్రేమకు భంగం కలుగుతుంది. అది మనపై సర్పదోషానికి కారణం అవుతుంది. కాబట్టి పొరపాటున కూడా జంటగా కలిసి ఉన్న పాములను చూడకూడదు. పాములు కూడా మన జీవితంలోని భవిష్యత్తులో జరిగే శుభ, అశుభ శకునాలను చెబుతాయి కాబట్టి పాము కనిపించగానే భయపడకుండా ఆ సంకేతం మనకు ఏ విషయాన్ని చెబుతుందో జాగ్రత్తగా గమనించటం మంచిది. ఒకవేళ చెడు సంకేతమే అయితే పరమశివునికి పూజలు చేస్తే ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది.