Site icon HashtagU Telugu

Ravivar: ఆదివారం ఈ 5 పరిహారాలు పాటిస్తే చాలు..మీ ఇంట్లో డబ్బే డబ్బు?

Ravivar

Ravivar

సూర్య భగవానున్ని పూజించడానికి ఆదివారం ప్రీతికరమైనదిగా భావిస్తారు. ఆదివారం సూర్య భగవానుని ఆరాధిస్తూ భక్తిశ్రద్ధలతో వేడుకుంటూ ఉంటారు. కాగా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్య భగవానున్ని గ్రహాల రాజు అని పిలుస్తారు అన్న విషయం తెలిసిందే. సూర్య భగవానుని అనుగ్రహం లభించడం వల్ల కష్టాలు దూరం అవడంతో పాటు సుఖసంతోషాలు ఐశ్వర్యం కీర్తి లభిస్తాయి. సూర్యుడు బలహీనమైన లేదా బాధాకరమైన స్థితిలో ఉంటే.. వ్యక్తులు తరచుగా అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఏ పని కూడా విజయవంతం అవదు.

మరి ఆదివారం రోజున ఎటువంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి మంచి బట్టలు ధరించి ఆ తర్వాత సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యాన్ని సమర్పించే సమయంలో ఖచ్చితంగా ఓం సూర్యాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ఆదిత్య నమః అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుడు అనుకున్నది నెరవేరుస్తాడు. అలాగే ఆదివారం రోజు ఇంటి బయటి తలుపుకు ఇరువైపులా నెయ్యి దీపం వెలిగించడం చాలా మంచిది.

నెయ్యి దీపం వెలిగించడం ద్వారా సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా ప్రసన్నులవుతారు. దాంతో అటువంటి ఇండ్లలో డబ్బుకి కొదవ ఉండదు. ఆదివారం రోజు ఇంట్లో నుంచి గంధపు తిలకం బయటకు తీయాలి అలా చేయడం వల్ల మీరు ఏ పని మీద అయితే బయటకు వెళ్తున్నారో ఆ పని అనుకున్న విధంగా పూర్తి అవుతుంది. ఆదివారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు. ఆదివారం దానం చేయడానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ రోజున సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి బెల్లం, పాలు, బియ్యం, దుస్తులు దానం చేయాలి. ఇలా చేస్తే మీరు చేసే పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి. అలాగే ఆదివారం రోజు ప్రవహించే నీటిలో బెల్లం, బియ్యం కలపడం మంచిది. ఇలా చేయడం వల్ల సూర్య భగవానుని అనుగ్రహం లభించడంతో పాటు ఆ ఇంట్లో లక్ష్మి దేవి కొలువై ఉంటుంది.