Site icon HashtagU Telugu

Vastu Tips: మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయా.. అయితే ఈ పరిహారాలు పాటించాల్సిందే?

Mixcollage 18 Feb 2024 05 55 Pm 2602

Mixcollage 18 Feb 2024 05 55 Pm 2602

సాధారణంగా ఒక వ్యక్తి జీవితం ప్రతికూల శక్తుల ప్రభావానికి లోనైతే అతని జీవితంలో అస్థిరత ఏర్పడుతుందని చెబుతుంటారు. వాటి కారణంగా ఏదో ఒక సమస్య అతనిని నిత్యం వేధిస్తూనే ఉంటుంది. తరచూ అనారోగ్యం బారిన పడతారు. రాత్రి నిద్రించే సమయంలో కూడా ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇక మీ జీవితంలోని ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం ఉందని గుర్తించాలి. అయితే ఈ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతికూల శక్తుల భారీ నుండి కాపాడుకోవడం కోసం కొన్ని జ్యోతిష్య పరిహారాలను పాటించవచ్చు. పదేపదే దుష్ట శక్తులు లేదా ఇంట్లో ప్రతికూల శక్తుల వల్ల ఆందోళన కలుగుతుంటే అమావాస్య రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత పూజ మందిరంలో వెండి గిన్నెలో కర్పూరం, లవంగాలను కాల్చి, అధిష్టాన దేవతను ప్రార్థించాలి.

కర్పూరం, లవంగాలను కాల్చిన పొగను ఇల్లంతా అన్ని మూలలకు చూపించాలి. ఈ పరిహారం చేయడం వల్ల ప్రతికూల శక్తుల సమస్య తగ్గుతుంది. నిద్రపోయే ముందు ఈ రెమిడీని ట్రై చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర పడుతుంది. ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల ఇబ్బంది పడుతుంటే, వాటి అవరోధాల నుండి బయట పడాలంటే పుష్య నక్షత్రంలో ఇంటి వెలుపల ఉమ్మెత్త మొక్కను నాటడం మంచిది. వేరును భూమిలో నాటే సమయంలో మూలం బయట ఉండేలా చూసుకోవాలి. ఈ పరిహారంతో భూత దోషం తగ్గుతుంది. ప్రతికూల శక్తుల ప్రభావం వల్ల ఇబ్బంది పడుతుంటే, వాటి అవరోధాల నుండి బయట పడాలంటే పుష్య నక్షత్రంలో ఇంటి వెలుపల ఉమ్మెత్త మొక్కను నాటండి.

వేరును భూమిలో నాటే సమయంలో మూలం బయట ఉండేలా చూడండి. ఈ పరిహారంతో భూత దోషం తగ్గుతుంది. ప్రతికూల శక్తుల ప్రభావం ఇంటిపైన ఉంటే అశోకా చెట్టు ఏడు ఆకులను ఇంటికి తెచ్చుకుని పూజ గదిలో అశోకా ఆకులను ఉంచి పూజలు చెయ్యాలి. స్నానం, జపం చేసిన తర్వాత అశోక ఆకులతో పూజ చెయ్యాలి. ఆకులు ఎండిపోతుంటే మళ్ళీ కొత్త ఆకులు తెచ్చి పూజించాలి. అంతేకాదు దుష్ట శక్తులను అరికట్టటం కోసం ఇంటికి దక్షిణం దిక్కులో నెయ్యి దీపం వెలిగించాలి. ఆపై పూర్వీకులను ప్రార్ధించాలి. ఈ పరిహారంతో దుష్ట శక్తుల ప్రభావం తగ్గుతుంది. పూర్వీకులు మీకు అండగా ఉండి ప్రతికూల శక్తుల నుండి కాపాడతారు.