Vermilion Remedies: కుంకుమతో ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. ఆర్థిక సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు?

  • Written By:
  • Publish Date - February 18, 2024 / 01:25 PM IST

మామూలుగా మనం వాస్తు విషయాలను వాస్తు నియమాలలో ఎంత జాగ్రత్తగా పాటించినప్పటికీ వాస్తు దోషాలు తలెత్తుతూ ఉంటాయి. దాంతో మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. దీనివల్ల ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను, చిరాకులను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఇంట్లో ఉన్న వాస్తు దోషాలను తొలగించడానికి కుంకుమతో కొన్ని పరిహారాలు పాటిస్తే చాలు అంటున్నారు పండితులు.. ఇంతకీ ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా వాస్తు శాస్త్రం ప్రకారం కుంకుమ ఇంటికి శ్రేయస్సును కలిగిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతిని కలిగిస్తుంది.

ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నవారు, ఆ ఇబ్బందుల నుండి బయటపడడానికి ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత నీటిలో చిటికెడు కుంకుమ కలిపి, సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. తూర్పు వైపున తిరిగి సూర్య భగవానుడిని చూసి, ఆర్ఘం సమర్పించి మనస్ఫూర్తిగా సూర్యుని పూజిస్తే వారి జాతకంలో సూర్యుడు బలపడతాడు. ఫలితంగా సూర్యుడు ఆశీస్సులు వారి పైన కచ్చితంగా ఉంటాయి. వారి ఆర్థిక సంక్షోభం దూరం అవడమే కాకుండా, ప్రశాంత జీవనాన్ని సాగించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నవారు జాస్మిన్ ఆయిల్లో కుంకుమను కలిపి ఐదు వారాల పాటు హనుమంతుడికి సమర్పించాలి.

హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం నాడు ఐదు వారాలు జాస్మిన్ ఆయిల్ లో సింధూరం ని కలిపి హనుమంతునికి సమర్పిస్తే కచ్చితంగా ఆయన దయ కచ్చితంగా కలుగుతుంది. కాగా హనుమంతుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి, ఎర్రటి సింధూరాన్ని హనుమంతునికి నివేదించాలి. ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడమే కాకుండా ఉద్యోగ వ్యాపారాలలో కూడా పురోగతి ఉంటుంది. డబ్బులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంట్లో వాళ్ళు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుంకుమ కలిపిన నీళ్లను వారికి దిష్టి తీసి, ప్రవహించే నీళ్లలో కలపాలి. ఇలా చేయడం వల్ల వారిపై ఉన్న నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఫలితంగా వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి పొందాలంటే బుధవారం నాడు వినాయకుడికి కుంకుమను సమర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారానికి కూడా పసుపుతో పాటు కుంకుమను పూసి పరిహారం చేయడం వల్ల ఇంట్లో ఆనందము శ్రేయస్సు వెల్లి విరుస్తుంది.