Site icon HashtagU Telugu

Astrology: పొరపాటున కూడా ఈ వస్తువులు కింద పడేయకండి.. అవేంటంటే?

Astrology

Astrology

ప్రతి ఒక్క మనిషి వారి జీవితంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులను చేస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు తెలిసి తెలియక చేసే తప్పుల వల్ల వాటి ఫలితాలను అనుభవించాల్సి ఉంటుంది. మనం చేసే ఆ చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకు కూడా దారితీస్తూ ఉంటాయి. అందుకే మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల విషయంలో కూడా కచ్చితంగా జాగ్రత్త వహించాలి. అలా పొరపాట్ల మీద పొరపాట్లు చేసుకుంటూ పోవడం వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. శాస్త్రం ప్రకారం చేతుల నుంచి ఏదైనా వస్తువులు జారి పడిపోవడం అశుభకరమైనదిగా భావించారు.

అనుకోకుండా మీ చేతుల నుంచి ఉప్పు పడిపోతే రాబోయే కొద్ది రోజుల్లో డబ్బు కొరత ఏర్పడే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తించాలి. అలాగే పొరపాటు చేసిన వ్యక్తి జీవితంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ఉప్పు శుక్రుడు, చంద్రుడితో సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఉప్పు పడిపోవడం మన పతనానికి దారి తీయడం అని చెప్పవచ్చు. చేతి నుంచి పాలు కింద ఒలకడం కూడా మంచిది కాదు. చేతిలో నుంచి పాలు పడితే కుటుంబంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటాయి. అలాగే కుటుంబంలో గొడవలు ప్రారంభం అవుతాయ. వాస్తు శాస్త్రం ప్రకారం చేతిలో నుంచి బియ్యం, గోధుమ వంటి ధాన్యాలు కిందపడటం కూడా అశుభమే. ఒకరి చేతి నుంచి ధాన్యం కిందపడితే అన్నపూర్ణ తల్లికి అవమానంగా పరిగణించాలి.

అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఆహార కొరతను ఎదుర్కొంటారని చెప్పవచ్చు. నల్ల మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి కింద పడిపోవడం అంటే మీరు లేదా మీకు దగ్గరగా ఉన్నవారు రాబోయే రోజుల్లో అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. పూజా ఫలకం పడిపోవడం కూడా మంచి శకునం కాదని పురాణాల్లో పేర్కొన్నారు. ఇది కుటుంబంలో పెద్ద సంక్షోభానికి దారి తీసే అవకాశం ఉంటుంది.