Friday: మహిళలు పొరపాటున కూడా శుక్రవారం రోజు ఈ పనులు అస్సలు చేయకూడదు?

భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక దేవుణ్ణి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ

  • Written By:
  • Publish Date - February 28, 2023 / 06:00 AM IST

భారతదేశంలో హిందువులు ఒక్కొక్క రోజు ఒక్కొక దేవుణ్ణి ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆ ప్రత్యేక రోజుల్లో కొన్ని తెలిసి తెలియక కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటారు. అలా శుక్రవారం కూడా కొన్ని రకాల పొరపాట్లను పనులను అస్సలు చేయకూడదు. శుక్రవారానికి శుక్రుడు అధిపతి ఆ రోజున శుక్రుడికి ఇష్టమైన పనులు చేయడం మంచిది. శుక్రగ్రహం అభివృద్ధిని ఆకాంక్షించే గ్రహం కాబట్టి ఆరోజు శుక్రుణ్ణి పూజించడం ఎంతో మంచిది. అలాగే ఇంట్లోకి కొత్త వస్తువులు తెచ్చుకోవడం మంచిది. అయితే ఈ శుక్రవారం రోజున మహిళలు కొన్ని రకాల పనులు చేయకూడదు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆ రోజున లక్ష్మి దేవి అనుగ్రహం కోసం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. శుక్రవారం రోజున ఇంట్లో బూజును దులపరాదు. శుక్రవారం రోజు ఇంట్లోని బూజు దులపడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది. ఆ రోజు పూజ గదిని శుభ్రం చేసినా శుభ్రం చేయగా వచ్చిన వస్తువులు బయటపడే రాదు. పాత సామాన్లు, పాత బట్టలు ఎవరికి దానమివ్వకూడదు. అలా చేయడం వల్ల ఇంట్లో సంపద వెళ్లిపోతుంది. అలాగే శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులు తీయకూడదు. పసుపు, కుంకుమని పొరపాటున కూడ జార విడచకూడదు. ఆరోజు కుంకుమ కింద పడకూడదు, దేవుడి ముందు పెట్టిన పూలు వాడిపోయిన, ఇంటి తలుపుకు పెట్టిన పూలు వాడిపోయిన, గుమ్మానికి పెట్టిన పూలు వాడిపోయినా అరిష్టం.

అలాగే శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు. అలా చేస్తే సంపద హరించుకుపోతుంది. కేవలం బుధ, శనివారాల్లో మాత్రమే తల స్నానం చేయాలి. శుక్రవారం తలస్నానం చేస్తే లక్ష్మీదేవికి తలనొప్పి వస్తుందట. అదేవిధంగా ఆడపిల్లలు ఉన్నవారు శుక్రవారం ఆడపిల్లలను అత్తారింటికి పంపరాదు. అలాగే శుక్రవారం మహిళలు కంటతడి పెట్ట కూడదు. కుటుంబ సభ్యులను తిట్ట కూడదు. విలేనంతవరకు శుక్రవారం రోజున ఎటువంటి బూతులు కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండడం మంచిది.