Site icon HashtagU Telugu

Astrology: ఆ వస్తువులు పదేపదే కింద పడిపోతున్నాయా.. అయితే జరగబోయేది ఇదే?

Mixcollage 18 Feb 2024 09 12 Pm 6357

Mixcollage 18 Feb 2024 09 12 Pm 6357

మామూలుగా కొన్ని కొన్ని సార్లు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మన చేతిలో ఉన్న కొన్ని రకాల వస్తువులు చేయజారి కింద పడిపోవడం పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే పదే పదే వస్తువులు జారి కింద పడడం కొన్ని శుభసంకేతాలను, మరికొన్ని అశుభ సంకేతాలను ఇస్తాయి. మన చేతిలో నుంచి ఐదు వస్తువులు జారిపడితే అవి జరగబోయే అశుభానికి సంకేతమని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. మరి చేతిలో నుంచి ఎలాంటి వస్తువులు జారీ కింద పడిపోకూడదో, అలా జారి పడిపోతే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతి నుండి జారి పడకూడని ఆ ఐదు వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మన చేతి నుండి ఉప్పు ఎప్పుడు జారి కింద పడకూడదు. ఉప్పు శుక్రుడికి, చంద్రుడికి సంబంధించిన వస్తువు. కాబట్టి ఎప్పుడైతే ఉప్పు చేతిలో నుంచి జారి పడుతుందో అది మన జాతకంలో శుక్రుడు, చంద్రుడి బలహీనతలను సూచిస్తుంది. అలాగే పదేపదే ఉప్పు జారి పడటం కుటుంబ సభ్యుల అనారోగ్యానికి ఒక సూచన. దీంతో ధన నష్టం కూడా కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతిలో నుంచి ఎప్పుడు నూనె కింద పడకూడదు. నూనె కింద పడితే ఆర్థిక నష్టం జరుగుతుంది. అలాగే రుణగ్రస్తులుగా మారతారు. పదేపదే నూనె కింద పడిపోతే అప్పుల ఊబిలో కూరుకు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన చేతిలో నుంచి పాలు పదేపదే కింద పడకూడదు.

పాల గిన్నె పదేపదే చేతిలో నుంచి జారి పడిపోవడం జీవితంలో రాబోయే కొన్ని సమస్యలకు సూచనగా భావిస్తారు. పాలు చంద్రుడికి సంబంధించినవి కాబట్టి, పాలు పారబోసుకుంటే మానసిక అస్వస్థత, అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఇంట్లోకి పాలను తీసుకు వెళ్ళేటప్పుడే కాదు, పాలను కాచేటప్పుడు కూడా అవి పొంగిపోకుండా చూసుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూజకు ఉపయోగించే పూజ పళ్లెం చేతిలో నుంచి జారి పడటం ఏ మాత్రం మంచిది కాదు. చేతిలో నుంచి పూజ పళ్లెం జారి పడిపోవడం వల్ల మీరు ఎంతో ఇష్టంగా పూజించే దేవుడికి కోపం వస్తుందట. ఇది మీ జీవితంలో చెడు జరగబోతుంది అని చెప్పడానికి సంకేతంగా భావించాలి. మన చేతిలో నుంచి సింధూరం ఎప్పుడూ కింద పడిపోకూడదు. కుంకుమ భరణి చేతి నుండి కింద పడిపోతే జీవితంలో భవిష్యత్తులో పెద్ద సమస్యలు ఎదుర్కోబోతున్నారనే సంకేతమని చెబుతున్నారు. వివాహిత స్త్రీలు భర్తకు సంబంధించిన విషయంలో చెడు వార్తలు వినే ప్రమాదం ఉంటుంది. .

Exit mobile version