Tuesday: మంగళవారం రోజు పొరపాటున కూడా ఈ పనులను అస్సలు చేయకండి?

హిందూ మతం ప్రకారం వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అలా మంగళవారం రోజు దుర్గాదేవికి అలాగే ఆంజనేయ స్వామికి అం

  • Written By:
  • Publish Date - July 4, 2024 / 09:13 AM IST

హిందూ మతం ప్రకారం వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. అలా మంగళవారం రోజు దుర్గాదేవికి అలాగే ఆంజనేయ స్వామికి అంకితం చేయబడింది. అందుకే ఈ భక్తులు మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా చాలా మంది తెలిసి తెలియక మంగళవారం రోజు కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. దానివల్ల అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మంగళవారం రోజు తెలిసి తెలియకుండా ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎట్టి పరిస్థితులలోనూ మంగళవారం రోజు అప్పు చేయవద్దు. ఒకవేళ మీరు అప్పు తీర్చాలి అనుకుంటే మంగళవారం రోజు ఒక్క రూపాయి అయినా సరే అప్పు తీర్చడం వల్ల ఆ అప్పు తొందరగా తీరిపోతుంది. మంగళవారం రోజు అప్పులు తీసుకోవడం వల్ల మళ్ళీ ఆ అప్పు తిరిగి చెల్లించడం చాలా కష్టమవుతుంది. అదేవిధంగా మంగళవారం రోజు తెలిసి తెలియకుండా కొత్త బట్టలు కొనుగోలు చేయకూడదు. అలాగే కొత్త బట్టలు కూడా ధరించకూడదు. అయితే ఎందుకు ధరించకూడదు ఎందుకు కొనుగోలు చేయకూడదు అన్న విషయానికొస్తే.. ఒకవేళ కొత్త బట్టలు ధరించినా కూడా అవి ఏదో ఒక కారణం చేత చిరిగిపోతాయని నమ్ముతారు. లేదంటే ఆ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవట.

ఒకవేళ మీరు కొత్త బట్టలు కొనుగోలు చేయాలన్న, ధరించాలన్న శుక్రవారం రోజున పవిత్రంగా భావించవచ్చు అంటున్నారు పండితులు. అలాగే మంగళవారం రోజు మసాజ్ చేయించుకోవడం, మాలిష్ చేయించుకోవడం లాంటివి అస్సలు చేయరాదు. ఇలా చేయడం వల్ల అది మీ ఆరోగ్యం పై ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఈ రోజున మసాజ్ చేయించుకోవడం వల్ల తలనొప్పి లేదా శరీరంలో తెలియని బాధ వస్తాయి. దాంతో అనేక వ్యాధులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే మంగళవారం రోజున పొరపాటున కూడా హెయిర్ కట్ చేసుకోవడం గోళ్లు కత్తిరించడం లాంటివి అస్సలు చేయకూడదు. ఈ రెండు పనులు చేయడం వల్ల ఆయుష్షు తగ్గుతుందని, సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు పండితులు. షేవింగ్ చేయించుకోవడం వల్ల శారీరక సమస్యలతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే మంగళవారం రోజున కొత్త చెప్పులు,బూట్లు వంటివి అసలు ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే డబ్బు కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఆనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్య అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మంగళవారం రోజున తెలిసి తెలియకుండా ఇలాంటి తప్పులు అస్సలు చేయకండి.