Animals: ఈ 5 రకాల మూగ జీవులకు ఆహారం పెడితే చాలు.. ఆ సమస్యలన్నీ మాయం?

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. అందుకే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉంటారు. ఆకలి

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 08:00 PM IST

అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అని అంటూ ఉంటారు. అందుకే ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతూ ఉంటారు. ఆకలి అన్నవారికి, ఆకలి తప్పికలతో అలమటించే వారి ఆకలి తీర్చే వారికి ఆ దేవుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. కేవలం మనుషులకు మాత్రమే కాకుండా మూగజీవాలకు కూడా ఆకలి తీర్చడం అన్నది ఎంతో గొప్ప మంచి పని. ముఖ్యంగా ఈ ఐదు రకాల మూగజీవాలకు ఆహారాన్ని అందించడం వల్ల కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి ఆ ఐదు రకాల మూగజీవాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అందులో మొదటిది ఆవు. హిందూ ధర్మం ప్రకారం భారతీయులు ఆవుని గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు.

కొంత మంది గోపూజ కూడా నిత్యం చేస్తుంటారు. ఆవుకు దాణా అందించడం ద్వారా కుండలిలో ఉన్న గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చు. సంపద, వంశాభివృద్ధి ఆశించే వారు ఆవుకు పచ్చగడ్డి, గోధుమ పిండితో చేసిన మిఠాయి తినిపించడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే చేపలకు ఆహారాన్ని వేయడం ద్వారా శత్రుపీడ నాశనం అవడంతో పాటు కష్టాల్లో నుంచి బయటపడవచ్చు. అప్పులు చాలా ఉండి అవి తీర్చడానికి ఇబ్బంది పడుతుంటే, లేదా ఆర్థిక సంక్షోభాలు చుట్టి ముట్టి ఉంటే గోధుమ పిండితో చేసిన ఉండలు లేదా ఎండు మొక్కజొన్న గింజలు తప్పకుండా చేపలకు ఆహారంగా వెయ్యాలి. మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ ఆహారం చేపలకు సూర్యాస్తమయానికి ముందు లేదా సూర్యాస్తమయం తర్వాత అందించాలి. ఇంట్లో అక్వేరియం పెట్టుకోవడం, చేపలకు దాణా ఇవ్వడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

జంతువులలో ఎక్కువగా స్నేహంగా ఉండడంతో పాటు విశ్వాసంగా ఉండే జీవి కుక్క. అందుకే ప్రతి ఒక్కరూ ఇంటికి దగ్గర కుక్కలను పెంచుకుంటూ ఉంటారు. అలా పెంచుకోలేనివారు వీధి చివరన బయట ఎన్నోవీధి కుక్కలు ఉంటాయి. ఆ వీధి కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల శని రాహు కేతువుల కోపం నుంచి రక్షణ పొందవచ్చు. సాధారణంగా శనివారాలు నల్లని కుక్కలకు ఆహారం ఇస్తుంటారు. ఇలా చెయ్యడం వల్ల శని ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది. నమ్మకం. నిజానికి కుక్కల రంగుతో గ్రహాలకు ఎలాంటి సంబంధం లేదు. ఏ కుక్కకు ఆహారం ఇచ్చినా దుర్ఘటనలు, ఇతర ప్రమాదాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇంట్లో కుక్కును పెంచుకునే వారు ఆ కుక్క బాగోగులు శ్రద్ధగా చూసుకోవాలి.

లేదంటే గ్రహాలు ప్రతికూలంగా మారవచ్చు. రాహువు వల్ల జీవితంలో చాలా కష్టాలు వస్తాయి. చీమలకు ఆహారం వెయ్యడం వల్ల రాహువు పెట్టె కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు. చీమలకు చక్కెర, గోధుమ ఉండలు ఆహారంగా ఇవ్వాలి. చీమలకు ఆహారం అందించడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. పక్షులకు తిండి నీళ్లు అందించడం చాలా మంచి పని. పక్షులకు జొన్నలు, సజ్జ గింజలు వెయ్యడం వల్ల మీకు చదువు, కేరీర్ కు సంబంధించిన కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన సంబంధ సమస్యలు ఉన్న వారు కూడా పక్షులకు ఆహారం అందించడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. డాబా మీద లేదా ఆరుబయట పక్షుల కోసం నీళ్లు, తిండి ఉంచడం ద్వారా ఇంట్లోకి సమృద్ధి, విజయం వస్తుందని నమ్మకం.