శనీశ్వరుడి అనుగ్రహం ఒక్కసారి కలిగింది అంటే చాలు వారు అన్ని విషయాలలో విజయం సాధించడంతో పాటు కోటీశ్వరుడు అవ్వడం ఖాయం అంటున్నారు పండితులు. మరి అలాంటి శనీశ్వరుడి అనుగ్రహం కలగాలి అంటే తప్పకుండా కొన్ని రకాల నియమాలు పరిహారాలు పాటించాలట. మరి అందుకోసం ఏం చేయాలో ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శనివారం నాడు శని దేవుడిని పూజించడం వల్ల జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు పొందుతారు. ఈ రోజున కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మీరు శని హానికరమైన ప్రభావాలను తొలగించవచ్చట.
కండకశని, ఏలిననాటి శని వంటి పీడలతో బాధపడేవారు శనివారం నాడు కొన్ని పరిహారాలు చేయడం ద్వారా ఈ అరిష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అయితే శనిదోషం నుండి బయటపడటానికి శనివారం శని దేవునికి ఇష్టమైన నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం ద్వారా శని ప్రభావం తగ్గుతుందట. అదేవిధంగా కొన్ని నల్ల నువ్వులను నల్ల గుడ్డలో కట్టి నువ్వుల నూనెలో ముంచి ఆ తర్వాత మట్టి దీపం పై పెట్టి పెరిగించడం వల్ల శని అనుగ్రహం కలుగుతుందట. అలాగే హనుమంతుడిని, శని దేవుడిని పూజించేటప్పుడు నల్ల నువ్వులను నైవేద్యంగా సమర్పించాలని చెబుతున్నారు. జీవితంలో విజయం సాధించడానికి శనివారం రోజు చీమలకు నల్ల నువ్వులు అలాగే బియ్యప్పిండి పంచదార సమర్పించడం మంచిది అని చెబుతున్నారు.
అలాగే శనివారం రోజు నల్ల జాతి ఆవులు నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల దుష్ప్రభావాలను దూరం చేస్తాడట. పక్షులకు ఆహారం పెట్టడం కూడా మంచిదే అని చెబుతున్నారు. శనీశ్వరుడి అనుగ్రహం కోసం శనివారం రోజు పేదవాడికి నూనెతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం వల్ల జీవితంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయట. మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలి అంటే మీ ఎత్తుకు అనుగుణంగా ఉండే పట్టు దారాన్ని తీసుకొని శనివారం సాయంత్రం నీటితో శుభ్రంగా కడిగి, కొన్ని మామిడి ఆకులను తీసుకొని అదే దారంలో చుట్టి నదిలో వేయాలట. ఈ పరిహారం చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయిని అడ్డంకులు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
మర్రి చెట్టుకి పూజ చేసి ఏడుసార్లు ప్రదక్షిణలు చేస్తూ “ఓం శం శనైశ్చర్యాయ నమ:” అనే మంత్రాన్ని జపించాలని చెబుతున్నారు. ఆర్థిక సమస్యలు తీరాలి అంటే శనివారం మర్రి చెట్టు కింద రెండు పూటలా దీపాన్ని వెలిగించాలట. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి కుటుంబంలో ఆనందం శ్రేయస్సు నెలకొంటుందట.
శనివారాల్లో నల్లని బట్టలను దానం చేయడం ద్వారా శని దోషాల నుండి బయటపడవచ్చట. మీరు శనివారం కొన్ని ప్రత్యేక పనిని చేయబోతున్నట్లయితే, నలుపు రంగు ధరించడం మంచిదని అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు పండితులు.