Vastu : ఇంట్లో ప్రశాంతత ఉండాలంటే..ఈ వాస్తు నియమాలు తప్పనసరి..!!

  • Written By:
  • Publish Date - November 18, 2022 / 06:30 AM IST

ప్రతిఒక్కరూ కూడా తమ ఇల్లు సంతోషంగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలామంది ఇళ్లల్లో నిత్యం ఏదొక గొడవ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా కుటుంబ కలహాలతో ఇంట్లో మనశ్శాంతి కరువైతుంది. దీనిప్రభావం అన్ని రంగాలపై ఉంటుంది. కెరీర్ ఆగిపోవడం, చదువు దెబ్బతినడం, వ్యాపారం నష్టాలు, పని చేసే ప్రదేశంలో ఇబ్బందులు ఇలాంటి సమస్యలకు కారణం అవుతుంది.

అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం…మనం చేసే కొన్ని పనులతో ఇంట్లో ప్రశాంతతను పొందేలా చేసుకోవచ్చు. దోషాలు, కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఏం చేయాలో చూద్దాం.

శాంతి కోసం నివారణలు
వంటగది ఇంటికి ఆగ్నేయ దిశలో ఉండాలి. ఈ దిశలో ఉంటేనే సకలదేవతలు కొలువై ఉంటారు. ఇల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వినాయకుడి బొమ్మను ఇంటి ముందు అభిముఖంగా ఉంచాలి. ప్రవేశ ద్వారా దగ్గర ఖాళీ గోడ ఉండకూడదు. కాబట్టి ఆ స్థలంలో వినాయకుడి ప్రతిమను పెట్టండి. దీంతో ఇంట్లో శాంతి నెలకొంటుంది.

సోదరుల మధ్య విభేదాలు
ఇంట్లో అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతుంటే..వాటిని నివారించడానికి వినాయకుడిని క్రమం తప్పకుండా పూజించండి. అంతేకాదు శివపూజలో శమీ పత్రాన్ని ఉంచండి. విష్ణువుకు తులసి ఆకులతో పూజ చేయండి. రామ చరిత మానస నిత్యం పఠించండి.

భార్య భర్తల మధ్య మనస్పర్థలు
భార్య భర్తల మధ్య మనస్పర్థలు అనేవి సర్వసాధారణం కానీ. ఆ గొడవలు పెద్దగా మారడంతో ఇంట్లో సంతోషం లేకుండా పోతుంది. కాబట్టి బుధవారం నాడు రెండు గంటలపాటు భార్య భర్తలు మౌనం పాటించాలి. ఇంట్లో సమస్యలను నివారించడానికి భార్యను సంతోషపెట్టడానికి భర్త శుక్రవారం మంచి వాసన గల పెర్ఫ్యూమ్ భార్యకు ఇవ్వాలి. వెండి గిన్నెలో పెరుగు పంచదార కలిపి భాగస్వామికి ఇవ్వండి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత భర్త నుదిటిపై కుంకుమ పెట్టండి. నిత్యం శివపార్వుతులను స్మరించుకోండి.