Site icon HashtagU Telugu

Astrology: మీకు కలలో అవి కనిపిస్తున్నాయా.. అయితే మీరు ధనవంతులైపోతారు..!

Mixcollage 14 Mar 2024 07 51 Pm 7612

Mixcollage 14 Mar 2024 07 51 Pm 7612

మామూలుగా మనం నిద్రపోతున్నప్పుడు కలలు రావడం ఉన్నది సహజం. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు. అయితే కొంతమందికి పీడ కలలు తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది ఆందోళన చెందుతూ భయపడుతూ ఉంటారు. కలలో కొన్ని వస్తువులు కనిపిస్తే మంచిదట. ఆ వస్తువులు కనబడడం లక్ష్మీదేవి రాకను సూచిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంతకీ కలలో ఏ వస్తువులు కనబడితే మంచిదో తెలుసుకుందాం…

ఒకవేళ మీకు కలలో బంగారం కనబడితే మంచిదట. అంటే మీకు సంపద, విలువ వస్తువులు లభిస్తాయట. బంగారాన్ని ధరించినట్లు కలగంటే ఆభరణాలు, అపార సంపదలు మీ జీవితంలోకి వస్తాయని సంకేతమని జ్యోతిష్యులు చెప్పారు. మీ కలలో బంగారు బహుమతిని అందుకోవడం మీరు త్వరలో పనిలో అత్యంత గౌరవనీయమైన స్థానాన్ని సాధిస్తారని చెబుతున్నారు. కలలో డేగలు కనిపిస్తే ధైర్యానికి ప్రతీకగా భావిస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. డేగలు కలలో కనిపిస్తే వారి సంకల్పం నెరవేరుతుందట. పక్షులు కలలో కనిపిస్తే మంచి జరుగుతుందట.

కలలోకి ధాన్యం కనిపిస్తే చాలా మంచిదట. ధాన్యం భూ సంపదలో ఒకటిగా పరిగణిస్తారు. ధాన్యాలు కలలో కనిపిస్తే అదృష్టం వరిస్తుందని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు.చైనీస్ వ్యవసాయ జంతువులైన పశువుల వ్యర్ధాలు, పేడ పట్టుకోవడం కలలోకి వస్తే సంపద మరియు ఆర్థిక అదృష్టానికి సంకేతం అని చెబుతున్నారు. మీ కలలో 8 వ సంఖ్యను చూడటం అంటే సంపద, విజయం మరియు భౌతిక లాభాలు చేకూరుతాయని అర్థమట. చైనీస్, ఇతర ఆసియా సంస్కృతులలో ఎనిమిది అనే సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిగణిస్తారు. మరోవైపు, కలలో డబ్బు కనిపిస్తే అదృష్టం మీ వైపు ఉంటుందని అర్థమట.