Site icon HashtagU Telugu

Astro Tips: గోల్డ్ ఉంగరాలు ధరిస్తున్నారా.. తప్పకుండా ఈ విషయాల గురించి తెలుసుకోవాల్సిందే?

Astro Tips

Astro Tips

మామూలుగా మనలో చాలామందికి గోల్డ్ రింగ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొంతమంది రెండు ఉంగరాలు మాత్రమే ధరిస్తే మరి కొందరు ప్రతి ఒక్క వేలికి ఉంగరాలను ధరిస్తూనే ఉంటారు. కొందరు స్టైల్ కోసం రోల్డ్ గోల్డ్ ఉంగరాలు కూడా ధరిస్తూ ఉంటారు. అయితే గోల్డ్ ఉంగరాల ధరించడం మంచిది కానీ వాటిని ధరించే ముందు ఏ వేలుకు ఎలాంటి ఉంగరాన్ని ధరించాలి అన్న విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలని చెబుతున్నారు. తప్పు వేలికి ఉంగరం ధరించడం వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే మరి వేలుకు ఎలాంటి ఉంగరం ధరించాలి? అలాగే ఎలాంటి విషయాలను గుర్తుంచుకోవాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హిందువులు బంగారాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. శుభ సందర్భాలు, పండుగలు, వివాహాలకు బంగారాన్ని ఉపయోగిస్తారు. అలాగే బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా కూడా భావిస్తారు. బంగారం ఇంటికి గొప్ప ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. బంగారం ధరించడం వల్ల సూర్యుని శక్తి పెరుగుతుందట. ఇది జీవితంలో శుభ యోగాన్ని సృష్టించడం ప్రారంభిస్తుందని చెబుతున్నారు. బంగారం ధరించడం వల్ల వ్యక్తి జీవితంలో ధైర్యం, దృఢ సంకల్పం పెరుగుతాయట. అలాగే జాతకంలో సూర్యుడి స్థానం బలహీనంగా ఉన్నవారు బంగారం ధరించాలని చెబుతున్నారు. బంగారం ధరించడం వల్ల శరీరం, మనస్సుపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుందట.

ఎవరైనా సరే ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించవచ్చట. ఉంగరపు వేలుకు బంగారు ఉంగరం ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. మన శరీరంలోని రెండు ఉంగరపు వేళ్లలోని నరాలు గుండెకు అనుసంధానించబడి ఉన్నాయని చాలామంది నమ్ముతారు. అందువల్ల బంగారు ఉంగరాన్ని ఎల్లప్పుడూ ఉంగరపు వేలుకు ధరించాలట. అందుకే నిశ్చితార్థం సమయంలో కూడా బంగారు ఉంగరాన్ని ఉంగరపు వేలుకు మాత్రమే ధరిస్తారు. అయితే చిటికెన వేలికి బంగారు ఉంగరాన్ని కూడా ధరించవచ్చట. కాగా మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించడం అశుభం అని చెబుతున్నారు. బంగారు ఉంగరాన్ని ఎప్పుడూ మధ్య వేలుకు ధరించకూడదట. అలా చేయడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. ఇది శనీశ్వరుడి సంబంధించిన వేలు. కనుక మధ్య వేలుకి బంగారం ఉంగరం ధరించడం వల్ల ప్రతికూల ఫలితాలకు అవకాశాలు ఏర్పడతాయట. డబ్బు విషయాలలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చనీ చెబుతున్నారు. కాబట్టి పొరపాటున కూడా మధ్య వేలుకు బంగారు ఉంగరం ధరించకూడదట. బొటనవేలు చంద్రుడిని సూచిస్తుందట. ఎవరైనా బొటనవేలికి ఉంగరం ధరించాలనుకుంటే ఈ వేలికి బంగారు ఉంగరానికి బదులుగా వెండి ఉంగరాన్ని ఉపయోగించాలట. అది మరింత ఉపయోగకరంగా ఉంటుందట.