Site icon HashtagU Telugu

Bathing: స్నానం చేసేటప్పుడు వీటిని నీళ్లలో కలిపి స్నానం చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం ?

Mixcollage 17 Jan 2024 05 47 Pm 7197

Mixcollage 17 Jan 2024 05 47 Pm 7197

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనం స్నానం చేసేటప్పుడు కొన్ని రకాల నియమాలను పాటించడం వల్ల మంచి శ్రేయస్సు లభించడంతో పాటు అదృష్టం కూడా వరిస్తుంది అంటున్నారు పండితులు. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు అందులో కొన్నింటిని కలిపి స్నానం చేయడం వల్ల సానుకూల ఫలితాలను పొందవచ్చట. మరి స్నానం చేసేటప్పుడు నీటిలో ఎలాంటివి కలిపి స్నానం చేస్తే అదృష్టం వరిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్నానం చేసేటప్పుడు అందులో కొద్దిగా పచ్చి పాలను కలిపి స్నానం చేయడం వల్ల రోగాలు దరి చేరవు. అంతేకాకుండా అలా పచ్చిపాలను కలిపిన నీటితో స్నానం చేసే వారి వయసు కూడా పెరుగుతుంది.

కంటి చూపు దెబ్బ తినే ప్రమాదం కూడా ఉండదట. చాలామంది అప్పుడప్పుడు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసుకొని స్నానం చేస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా మంచిది. చిటికెడు పసుపు కలిపి నీటితో స్నానం చేయడం వల్ల జాతకంలో బృహస్పతి స్థానం బలపడుతుంది. దీంతో మీరు విధిలో సానుకూల మార్పులను చూస్తారు. పసుపుతో పాటుగా గంధాన్ని నీటిలో కలిపి స్నానం చేస్తే మీ అదృష్టం బాగుంటుంది. మీరు రోజూ నీటిలో చిటికెడు ఉప్పు కలిపి స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ మీ నుంచి దూరమవుతుంది. రోజు అలా చేయలేని వారు స్నానం చేసిన ప్రతిసారి ఆ విధంగా కొంచెం ఉప్పు వేసుకుని స్నానం చేస్తే నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి.

రోజ్ వాటర్ మన అందాన్ని పెంచుతుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. అయితే ప్రతిరోజూ స్నానం చేసే నీటిలో రెండు చుక్కల రోజ్ వాటర్ కలిపి స్నానం చేయడం వల్ల కూడా ప్రయోజనాలను పొందవచ్చు. ఇలా స్నానం చేయడం వల్ల మీ ఆత్మగౌరవం పెరుగుతుంది. అలాగే యాలకులను నీటిలో వేసి స్నానం చేస్తే నెగెటివ్ ఎనర్జీ దూరం అవుతుంది.

Exit mobile version