Site icon HashtagU Telugu

Astro Tips: విద్య, వ్యాపార అభివృద్ధిలో మార్పులు రావాలి అంటే ఏం చేయాలో, ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసా?

Astro Tips

Astro Tips

నవగ్రహాలలో ఒకటైన బుధ గ్రహం గురించి మనందరికీ తెలిసిందే. జీవితంలో ఎదురయ్యే చాలా రకాల సమస్యలకు బుధ అనుగ్రహానికి సంబంధం ఉంది అని అంటున్నారు పండితులు. కాగా వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు విద్యకు కారకుడని చెప్పబడింది. ఇది వ్యాపారంలో కూడా ఒక ముఖ్యమైన సహకారాన్ని కలిగి ఉందట. బుధ గ్రహం తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, కమ్యూనికేషన్, వ్యాపారం, చర్మం, అందం, స్నేహానికి కారకుడు అని చెప్పాలి
బుధుడిని గ్రహాల రాకుమారుడు అని కూడా అంటారు.

బుధుని వింషోత్తరి దశ 17 సంవత్సరాలు. ఒక వ్యక్తి వయస్సు ప్రకారం అతని జాతకంలో, అతను విద్యను అభ్యసిస్తున్నప్పుడు, ఆ సమయంలో జాతకంలో బుధునితో మంచి సంబంధం లేని లేదా సహజ ప్రయోజనాలతో బుధునితో సంబంధాన్ని ఏర్పరుచుకునే ఏదైనా గ్రహ పరిస్థితి వస్తే, బుధుని సాపేక్ష బలం బాగుంటే, జన్మ జాతకం, నవజ కుండలి, వర్గ కుండలిలో బుధుని స్థానం బలంగా ఉంటే, శుభ గ్రహాలతో దీని సంబంధం బాగుంటే దీని ప్రభావం బాగుంటుందని అర్థం. గ్రహాలతో సంబంధం వ్యతిరేకమైతే దాని ప్రభావం మంచిది కాదని అర్ధం అంటున్నారు.

అయితే బుధుడిని ప్రసన్నం చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది మొదటి మార్గం. త్రిమూర్తులలో లోక రక్షకుడు విష్ణువును పూజించాలట. అలాగే అయ్యప్ప స్వామిని కూడా పూజించాలట. అదేవిధంగా దేవతలలో త్రిపుర దేవిని, సుందరి దేవిని నిరంతరం పూజించాలని చెబుతున్నారు. పైన చెప్పిన విధంగా ఆయా దేవుళ్ళను పూజిస్తే బుధుడి అనుగ్రహం కలగడంతో పాటు వ్యాపారంలో విద్యలో అభివృద్ధి కలుగుతుందని మంచి ఫలితాలు కనిపిస్తాయని చెబుతున్నారు.