Site icon HashtagU Telugu

Astro Tips: శని అలాగే రాహు,కేతువు దోషాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ మొక్కను ఇంటి ఆవరణలో పెంచాల్సిందే!

Astro Tips

Astro Tips

జీవితంలో ఏదో ఒక సమయంలో మనం కొన్ని రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అయితే మనం జీవితంలో ఎదుర్కొనే సమస్యలకు కారణం మన జాతకం లోని విగ్రహాలు. గ్రహాల కారణంగా శుభ అశుభ ఫలితాలను ఎదుర్కోక తప్పదు. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ శనీశ్వరుడు లేదంటే రాహు కేతువుల దోషాలతో ఎప్పుడూ ఒకసారి బాధపడాల్సి ఉంటుంది. అయితే ఈ దోషాల నుంచి బయటపడడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఇలా రాహుకేతువులు ఇలా శని దోషాలతో బాధపడుతున్న వారు వాస్తు ప్రకారం ఇప్పుడు చెప్పబోయే మొక్కను ఇంటి వద్ద నాటుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు.

ఆ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హిందూ మతంలో వేప చెట్టు చాలా పవిత్రమైనదిగా భవిస్తారు. వేప చెట్టుకి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. దేవతగా భావించి పూజలు కూడా చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఎల్లమ్మ దేవతగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ వేప చెట్టు శనిశ్వరుడి వలన కలిగే దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుందట. అయితే ఈ చెట్టుని సరైన దిశలో పెంచడం ముఖ్యం అని చెబుతున్నారు. వేప చెట్టుని సరైన దిశలో పెంచడం వలన గ్రహ దోషాలు తొలగిపోయి ఇంటికి శ్రేయస్సు లభిస్తుందట. వేప చెట్టు నాటడం వల్ల కలిగే లాభాల విషయానికొస్తే..

వేప చెట్టు దగ్గర ప్రతికూల శక్తి మనుగడ సాగించదు. ఇది రాహువు, కేతువు, శనిశ్వరుడి ప్రభావాలను తగ్గించడమే కాదు సానుకూలత, సంపదను కూడా తెస్తుందని, ఇంటి బయట వేప చెట్టును నాటడం వల్ల చెడు దృష్టి, పూర్వీకుల శాపం,శని కుజుడు శాపం నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. వేప కుజుడు, శని, కేతువు గ్రహాలకు సంబంధించినది కాబట్టి అటువంటి పరిస్థితిలో వేప మొక్కను నాటడానికి దక్షిణ దిశ అత్యంత పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. వేప చెట్టు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఉత్తర భారత దేశంలో వేప చెట్టును నీమారి దేవిగా వ్యవహరిస్తారు. కొన్ని శుద్ధి కార్యక్రమాల్లో వేప రెమ్మలను కూడా ఉపయోగిస్తారు. వేప చెక్కతో హవనము చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయని నమ్మకం. వేప ఆకులను కాల్చడం వల్ల ప్రతికూల శక్తులు నశిస్తాయని నమ్మకం. అలాగే వేపకు అంగారక గ్రహానికి సంబంధం ఉంది. ప్రతిరోజూ వేప చెట్టుకు నీరు సమర్పించడం ద్వారా కుజ గ్రహ దుష్ప్రభావాలను శాంతింపజేసే హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుందట. వేప మాల ధరించడం ద్వారా శనిశ్వరుడి అశుభ ప్రభావాలను కూడా నివారించవచ్చట. అలాగే జాతకంలో కేతు దోషం ఉంటే నీటిలో వేప ఆకులు కలిపి స్నానం చేయడం ప్రయోజనకరంగా ఉంటుందట.